Vakeel Saab : ఒక్క దెబ్బతో బాలివుడ్ ని కూడా కొట్టాలని టార్గెట్ పెట్టిన PSPK26…!

-

దాదాపు రెండేళ్ళ తర్వాత పవన్ కళ్యాణ్ సినిమా వస్తుంది అనగానే సినిమా మార్కెట్ పైనే చర్చలు అన్నీ జరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ సినిమా కావడంతో క్రేజ్ సాధారణంగా ఉంటుంది కాబట్టి మార్కెట్ భారీగా జరిగే అవకాశం ఉంటుంది. ఈ సినిమాను ఎలాగూ దిల్ రాజు నిర్మిస్తున్నారు. దానికి తోడు పవన్ రీ ఎంట్రీ ఇవ్వడంతో మార్కెట్ మీద లెక్కలు మొదలయ్యాయి. ముందు నుంచి అనుకున్న విధంగానే టైటిల్ ని వకీల్ సాబ్ గా ఖరారు చేసింది చిత్ర యూనిట్.

ఈ సినిమాను బాలీవుడ్ నిర్మాత బోని కపూర్ కూడా నిర్మిస్తున్న నేపధ్యంలో పాన్ ఇండియా వైడ్ గా సినిమా విడుదల అవుతుంది. దీనితో బాలీవుడ్ లో కూడా ఈ సినిమాకు సంబంధించిన ప్రచారం ఎక్కువగా చేస్తున్నారు. అక్కడ పింక్ సినిమా మంచి హిట్ అవ్వడంతో ఈ సినిమాకు కూడా క్రేజ్ సాధారణంగా ఏర్పడుతుంది. ముఖ్యంగా మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడులో తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఇక ఓడిస్సాలో కూడా మన వాళ్ళు ఉన్నారు.

ఎలాగూ ఉత్తరాది రాష్ట్రాల్లో బోని కపూర్ సినిమాలకు ఒక క్రేజ్ ఉంది. ఆయన సినిమాల్లో దాదాపుగా అన్ని హిట్ సినిమాలే కావడంతో మార్కెట్ ఎలా ఉంటుంది అనేది చూడాలి. వసూళ్లు 200 కోట్లపైగా దేశ వ్యాప్తంగా ఉంటాయని టాక్. ఇక విదేశాల్లో కూడా సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. భారీగా అంచనాలతో వస్తుంది కాబట్టి, అమెరికా, బ్రిటన్ లో ఉన్న మన తెలుగు వాళ్ళు హీరోతో సంబంధం లేకుండా సినిమాలు చూస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news