ఉమెన్స్ డే కి చిన్న గిఫ్ట్ ఇచ్చిన వకీల్ సాబ్ ..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వేణు శ్రీరాం దర్శకత్వంలో వస్తున్న చిత్రం వకీల్ సాబ్… బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన పింక్ సినిమా రీమేక్ గా వస్తున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ లాయర్ గా నటిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ ఫస్ట్ లుక్ ని ఇటీవల విడుదల చేసింది చిత్ర యూనిట్. దీనికి మంచి స్పందన వచ్చింది సోషల్ మీడియాలో. దిల్ రాజు, బోని కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు ఈ సినిమాను.

త్వరలో ప్రేక్షకుల ముందుకి రానున్న ఈ సినిమాలో మొదటి పాట ప్రోమో ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా అంటూ ఒక ప్రోమోని విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ పాటను సిద్ శ్రీరాం పాడాడు. పాటను విడుదల చేసిన కాసేపటికే సోషల్ మీడియాలో వైరల్ అయింది. 18 సెకన్లు ఉన్న ఈ సాంగ్ ప్రోమో… ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తుంది.

విడుదల చేసిన కాసేపటికే రెండు లక్షల వ్యూస్ సాధించింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. దాదాపు రెండేళ్ళ తర్వాత పవన్ కళ్యాణ్ సినిమా రావడంతో ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. కాగా ఉమెన్స్ డే సందర్భంగా పూర్తి పాటను విడుదల చేయనున్నారు.