కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్యఅతిథిగా తెలంగాణ బిజెపి నాయకులు గచ్చిబౌలి లో భారీ సభ ఏర్పాటు చేయడానికి మొన్నటి వరకు రెడీ అయ్యారు. పౌరసత్వ సవరణ బిల్లు ఇంకా అనేక విషయాల గురించి ప్రజలలో ఉన్న భయాందోళనలు తీసివేయటానికి, తెలంగాణ బీజేపీ ఈ సభ భారీ ఎత్తున నిర్వహించడానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల నుండి భారీ జన సమీకరణ చేయాలని అన్ని ప్లాన్లు వేసింది. అయితే చివరి నిమిషంలో ఈ సభ క్యాన్సిల్ ఇవ్వటం జరిగింది. ఈనెల 15వ తేదీన జరగాల్సిన ఈ సభ క్యాన్సిల్ అవ్వటానికి కల కారణాలు గురించి అమిత్ షా మరియు బిజెపి నాయకులు అనేక కబుర్లు చెప్పారు. విషయంలోకి వెళితే భారత్ లో కరోనా వైరస్ వ్యాధి రోజురోజుకు ఎక్కువవుతున్న నేపథ్యంలో మరో పక్క పార్లమెంట్ సభలు జరుగుతున్న క్రమంలో ఇటువంటి టైం లో సభ మంచిది కాదని తెలపడం జరిగింది.
అయితే తెలంగాణ బిజెపి నాయకులు చేసిన ఈ కామెంట్లు తప్పు పడుతూ అసలు విషయం టిఆర్ఎస్ పార్టీ బయట పెట్టింది. అసలు బీజేపీ పార్టీలో లోకల్ కుమ్ములాటలు ఎక్కువవడంతో ఎక్కడ సభ నిర్వహిస్తే అక్కడ గొడవలు బయట పడే ఛాన్స్ ఉందని బీజేపీ నాయకులు కరోనా ముసుగులో కవరింగ్ చేసుకుంటూ అమిత్ షా సభ ని క్యాన్సిల్ చేసుకున్నారని టిఆర్ఎస్ నాయకులు ఆరోపించారు.