ఆ కోరిక తీర్చమంటున్న పూజా హెగ్దె

-

తెలుగులో ముకుందా సినిమాతో పరిచయమైన పూజా హెగ్దె ఆ తర్వాత నాగ చైతన్య సరసన ఒక లైలా కోసం సినిమాలో నటించింది. ఆ రెండు సినిమాలు నిరాశపరచడంతో అమ్మడు బాలీవుడ్ వైపు వెళ్లింది. హృతిక్ రోషన్ కు జోడీగా మొహెంజోదారో సినిమాలో నటించినా అమ్మడికి లక్ కలిసి రాలేదు. అయితే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ దువ్వాడ జగన్నాథం సినిమాలో పూజా బికిని లుక్స్ కు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.

అప్పటి నుండి ఆమెకు స్టార్ ఛాన్సులు వస్తున్నాయి. లేటెస్ట్ గా సూపర్ స్టార్ మహేష్ మహర్షి సినిమాలో పూజా హెగ్దె నటించింది. ఈ సినిమాలో తనకు ఛాన్స్ వచ్చినందుకు సో లక్కీ అంటుంది పూజా. ఇక మహర్షి ప్రీ రిలీజ్ వేడుకలో పూజా దేవి శ్రీ ప్రసాద్ తన కోరిక తీర్చాలని కోరింది. ఆమెకు గిటార్ వాయించడంతో పాటుగా పాటలు పాడే అనుభవం కూడా ఉందట.

తనలోని ఈ టాలెంట్ ను దేవి గుర్తించలేదని చెబుతుంది పూజా. అయితే ఆమె అడిగిన వెంటనే దేవి మైక్ అందుకుని తన వచ్చే సినిమాలో పూజాకి ఛాన్స్ ఇస్తానని చెప్పాడు. సో పూజా హెగ్దె కేవలం హీరోయిన్ గానే కాదు అమ్మడిలో స్పెషల్ క్వాలిటీస్ కూడా ఉన్నాయన్నమాట.

Read more RELATED
Recommended to you

Latest news