Puneetha Rajkumar: క‌న్న‌డ పవర్ స్టార్ లాస్ట్ ట్విట్.. నెట్టింట్లో వైర‌ల్.. ఎవ‌రికి చేశారంటే..?

Puneetha Rajkumar: క‌న్న‌డ పవర్ స్టార్ హీరో పునీత్ రాజ్‌కుమార్ తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. శుక్రవారం ఉదయం జిమ్‌ చేస్తుండగా ఆక‌స్మ‌తుగా గుండెపోటు రావటంతో ఆయన్ను బెంగళూరులోని విక్రమ్‌ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆలస్యం కావటంతో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించిందని వైద్యులు వెల్లడించారు. నటుడిగా నేపథ్య గాయడకుడిగా, టెలివిజన్ వ్యాఖ్యతగా, ఆడియో కంపెనీ ఓనర్‌గా, నిర్మాతగా ఎన్నో రంగాల్లో కన్నడ ఇండస్ట్రీకి సేవలందించారు పునీత్ రాజ్‌కుమార్‌.

తన అద్భుత మైన నటనతో కన్నడ , తెలుగు ప్రేక్షకులతో పాటు దేశ వ్యాప్తం గా చాలా మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఆయ‌న మరణ వార్త కన్నడ ప్రజలతో పాటు యావత్ దేశ వ్యాప్తంగా శోక సయుద్రం లో ముంచేత్తారు.

ఇదిలా ఉంటే పునీత్‌ మరణాంతరం .. నెటిజ‌న్లు ఆయన సోషల్‌ మీడియా పోస్టులు సెర్చ్‌ చేస్తున్నారు. దీంతో ఆయన చేసిన ఆఖరి ట్వీట్‌, మాటలు, ఇంటర్వ్యూలు వైరల్‌ అవుతున్నాయి. ఈ క్ర‌మంలో
చివర స‌రిగా ఆయన తన సోదరుడు, హీరో శివ రాజ్‌కుమార్‌కు ట్వీట్‌ చేశారు. శివరాజ్‌కుమార్ న‌టించిన
భజరంజీ 2 సినిమాకు సపోర్ట్ చేస్తూ ట్వీట్ చేశారు. ఆల్ ది బెస్ట్ చెప్తూ ట్వీట్ చేశారు పునీత్. అదే ఆయన ఆఖరి ట్వీట్ అవుతుందని ఎవరూ ఊహించలేదు.
http://

Best wishes for the entire team of #Bhajarangi2. @NimmaShivanna @NimmaAHarsha @JayannaFilms
— Puneeth Rajkumar (@PuneethRajkumar) October 29, 2021

కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్‌ వారసుడిగా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన పునీత్ రాజ్‌కుమార్. త‌న 20 ఏళ్ల కెరీర్లో 29 సినిమాలు చేశారు. వెండితెర మీద తిరుగులేని స్టార్ డమ్‌ సాధించారు. కన్నడ నాట అత్యథిక కలెక్షన్లు సాధించిన హీరోగా, హై రెమ్యూన‌రేష‌న్ తీసుకున్న న‌టుడుగా రికార్డ్ సృష్టించారు.

Read more RELATED
Recommended to you

Latest news