Ys షర్మిల కు మరోసారి తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు..తాను ఒక మహిళ గురించి తప్పుగా మాట్లాడలేదని.. ఏకవచనం వాడలేదని క్లారిటీ ఇచ్చారు. తాను మాట్లాడిన భాషలో ఏదైనా తప్పు ఉంటే చింతిస్తున్నానని వెల్లడించారు. సిఎం కేసీఆర్ పైన ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే తప్పు కాదా ? మరీ ఇది సంస్కరమేనా ? అని శర్మిలకు చురకలు అంటించారు మంత్రి నిరంజన్ రెడ్డి.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలు దశల వారిగా మొదలు అవుతున్నాయన్నారు. తాను సవాలు విసిరిన తర్వాత బిజెపి నేతలు పలాయనం చిత్తగించారని ఎద్దేవా చేశారు. కేంద్రం వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర ప్రకటించడం విధి అని.. మద్దతు ధరతో పాటు వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు చేయాల్సిన బాధ్యత కేంద్రానిదే …అది రాజ్యాంగంలో స్పష్టంగా ఉందన్నారు. కేంద్రం మద్దతు ధర ప్రకటించి…రాష్ట్రలు మీ చావు మీరు చావండి అంటుందని నిప్పులు చెరిగారు. కేంద్రంను మా వడ్లు కొనాలని అడుక్కోవాల్సిన పరిస్థితి నెలకొందని ఫైర్ అయ్యారు. పంజాబ్ రాష్ట్రం లో కొన్నప్పుడు… తెలంగాణ లో ఎందుకు కొనరు ? అని ప్రశ్నించారు.