టాలీవుడ్ డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘జనగణమన’ గురించి చాలా కాలం నుంచి చెప్తున్నారు. సూపర్ స్టార్ మహేశ్ బాబుతో ఈ సినిమాను పూరీ చేయబోతున్నారని వార్తలొచ్చాయి. కానీ, అవి నిజం కాలేదు. కాగా, ఎట్టకేలకు ఆ చిత్రానికి మోక్షం లభించింది. మంగళవారం చిత్ర అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చేసింది. ‘జేజీఎం’ పేరిట మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ‘జేజీఎం’ మూవీ యూనిట్ సభ్యులు ముంబైలో మీడియాతో మాట్లాడారు.
‘లైగర్’ ఫిల్మ్ తర్వాత పూరీ జగన్నాథ్ – విజయ్ దేవరకొండ కాంబినేషన్ మరో సారి రిపీట్ అవుతోంది. మోషన్ పోస్టర్ లాంచ్ సందర్భంగా విజయ్ దేవరకొండ హిందీలో మాట్లాడారు. ఆయన మాటలకు సంబంధించిన వీడియో యూట్యూబ్ లో వైరలవుతోంది. డైరెక్టర్ వంశీ పైడి పల్లి, చార్మి, పూరీ జగన్నాథ్, విజయ్ దేవరకొండ తదితరులు మీడియా సమావేశంలో పాల్గొన్నారు. తాను ఆర్మీ దుస్తుల్లో ఉండి ఈ పాత్రలో ‘జనగణమన’ చిత్రం చేయడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు విజయ్ దేవరకొండ.
ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండ మాట్లాడుతూ పూరీ జగన్నాథ్ ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ అని తెలిపాడు. తన డ్రీమ్ ప్రాజెక్ట్ చేయబోతున్నందుకు ఆనందంగా ఉందని పూరీ జగన్నాథ్ చెప్పాడు. ఆర్మీ సోల్జర్ తన దేశం కోసం ఏం చేస్తాడనే విషయాలపై ఫిక్షనల్ స్టోరిగా ‘జనగణమన’ తెరకెక్కబోతున్నదని వివరించాడు పూరీ జగన్నాథ్. ఈ చిత్రంలో కథానాయికగా అనన్య పాండే నటిస్తోంది. మొత్తంగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ మరోసారి పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో సినిమా చేయబోతుండటం విశేషం. ‘జేజీఎం’ వచ్చే ఏడాది ఆగస్టు 3న విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు.