మనం తీసుకున్న ఆహారంలో పిండిపదార్థాలు, మాంసకృతులు ఇవన్నీ పొట్టలో డైజెషన్ అవ్వాలంటే.. లోపల రకరకాల జీర్ణాది రసాలు తయారవుతాయి. పొట్ట అంచుల వెంబడి గ్యాస్ట్రిక్ జ్యూసెస్, హైడ్రో క్లోరిక్ యాసిడ్స్, అనేక రకాల ఎంజైమ్స్ ఇవన్నీ విడదలై ఆహారన్ని మెత్తగా అరిగించి పోషకాలుగా ప్రేగులు గ్రహించుకునే విధంగా మారుస్తాయి. ఈ ఆహారపదార్థాలు డైజెషన్ చేయాడనికి మెయిన్ గా కావాల్సింది హైడ్రోక్లోరిక్ యాసిడ్. ఇది రోజుకు 2-3 లీటర్లు ఉత్పత్తి అవుతుంది.
ఈ యాసిడ్ ఘాటును బట్టే మన డైజెషన్ పవర్ ఆధారపడి ఉంటుంది. దీని ఘాటు ఆహారం అరిగేప్పుడు 1-2PH మధ్యలో ఉంటుంది. 1PH అంటే ఘాటు ఎక్కువగా.. 2 అంటే కొంచె పలచన. 3/4/5 PH ఉంటే ఘాటు మరీ తక్కువ అని అర్థం. మనం తాగే కూల్ డ్రింక్స్ లో యాసిడ్ ఘాటు 2.5- 3.5PH ఉంటుంది. కానీ కొంతమందిలో 3-5PH మధ్యలో ఉంటుంది. అంటే చాలా తక్కువ ఘాటు ఉంటుంది. ఇలా ఉండటాన్నే.. హైపోక్లోరోహైడ్రియా ( Hypochlorhydria) అంటారు. ఈ సమస్య ఇన్ డైజెషన్ ఉండే 20శాతం మందిలో ఉంటుంది. ఈరోజు మనం ఈ సమస్య వల్ల ఏం నష్టాలు జరుగుతాయి అనేది చూద్దాం..
యాసిడ్ ఘాటు 1-2ph మధ్యలో ఉన్నప్పుడు పొట్టలో మనం తిన్న ఆహారాపదార్థాలు ద్వారా వెళ్లిన క్రిములు చంపబడతాయి. ఈ ఘాటు తక్కువగా ఉన్నప్పుడు ఈ క్రిములు చంపబడవు. ఇక ఈ బాక్టీరియాలన్నీ లోపల్ కామ్ గా ఉండవుగా.. పొట్ట ప్రేగుల్లో ఇన్ఫెక్షన్ కలిగించేట్లు చేస్తాయి. తిన్నది ఒంటికిపట్టదు, చెడ్డ సూక్ష్మజీవులు ప్రేగుల్లో ఉత్పత్తి అవడం లాంటి అనేక సమస్యలు వస్తాయి. గ్యాసెస్ సమస్య పెరుగుతుంది.
యాసిడ్ ఘాటు ఎక్కువగా ఉన్నప్పుడే మెతుకులు, ముక్కలు బాగా డైజెషన్ అవుతాయి. ఎప్పుడైతే ఘాటు తక్కువగా ఉన్నప్పుడే.. డైజెషన్ కాదు. పొట్టలో ఇవి పులుస్తాయి.. జీర్ణకోస సంబంధమైన సమస్యలకు కారణం అవుతాయి.
అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది..?
చాలా మంది కడుపులో మంటలకు, యసిడిటీకి యాంటాసిడ్స్( Antacids) ఎక్కువగా వాడతారు. మంటనుంచి ఉపశమనం పొందే టాబ్లెట్ల వల్ల ఈ సమస్య ఎక్కువగా వస్తుంది.
మరికొంతమంది పెయిన్ కిల్లర్స్ వాడతారు. దీనివల్ల కూడా ఈ సమస్య వస్తుంది.
మానసిక ఒత్తిడి వల్ల కూడా ఈ సమస్య ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది.
విటమిన్ b12లోపం కూడా కారణమే.
వృద్యాప్యంలో కూడా ఈ సమస్యలు వస్తాయి.
మరికొంతమంది సిరప్స్ ఎక్కువగా తాగుతారు. వాటివల్ల కూడా యాసిడ్ పల్చగా అవుతుంది..
హైపోక్లోరోహైడ్రియా ( Hypochlorhydria) లక్షణాలు:
మోషన్ లో ముక్కలు ముక్కలుగా రావడం
ఇన్ డైజేషన్ ఎక్కువగా ఉండటం
స్టమక్ బ్లోటింగ్ గా ఉండటం
అపానవాయులు ఎక్కువగా రావడం
చస్ట్ మంట
వికారం, వాంతు లక్షణాలు
ఏది తినాలనిపించదు, కానీ ఆకలివేస్తుంది
ఇలాంటి లక్షణాలన్నీ ఈ సమస్యకు ఉంటాయి..
Hypochlorhydria సమస్య నుంచి బయటపడాలంటే :
యాసిడ్ ఉత్పత్తిని పెంచే ఆహారాలు రెండు ఉన్నాయి. ఒకటి పైనాపిల్, రెండో బొప్పాయి. ఇవి బాగా తింటే.. యాసిడ్ ఘాటు పెరుగుతుంది.
తులసి, పసుపు, మిరియాలు, పిపళ్లు, పుదినా ఈ ఐదు యాసిడ్ ఘాటు పెంచడానికి ఉపయోగపడతాయి. వీటితో కషాయం చేసుకుని తాగొచ్చు
హై ఫైబర్ ఫుడ్ తినాలి.
ఎర్లీ డిన్నర్ తినాలి. వీలైనంత వరకూ నైట్ అన్నం తినకుండా.. ఫ్రూట్స్ ను ఎర్లీగా తినేసి.. మరుసటి రోజు ఉదయం 8 గంటల వరకు ఉంటే.. ప్రేగులు బాగా రెస్ట్ తీసుకుని యాసిడ్ ప్రొడ్యూస్ చేస్తాయి. కొంతమంది ఎప్పుడూ ఏదో ఒకటి నోట్లో వేసుకుని తింటూనే ఉంటారు. అసలు ఇది చాలా చెడ్డ అలవాటు.
వాటర్ బాగా తాగి.. రోజుకు రెండు సార్లు మోషన్ వెళ్లేలా ప్రయత్నించండి.
ఈ సమస్యను ఎలాంటి టాబ్లెట్ వాడకుండా.. ఈ పద్ధతులు ద్వారా తగ్గించుకోవచ్చు.
-Triveni Buskarowthu