‘సామీ సామీ’ అంటున్న బుడ్డొళ్ల వీడియో వైరల్..‘పుష్ప’ క్రేజ్ తగ్గేదేలే..

-

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ ఫిల్మ్ ‘పుష్ప’. ఈ సినిమాతో బన్నీ పాన్ ఇండియా స్టార్ అవడమే కాదు ఐకాన్ స్టార్ కూడా అయిపోయారు. సౌత్, నార్త్ అని తేడా లేకుండా దేశవ్యాప్తంగా ఈ సినిమాను ప్రేక్షకులు విశేషం గా ఆదరించారు.

గతేడాది డిసెంబర్ లో విడుదలైన ఈ సినిమా మేనియా ఇంకా కొనసాగు..తుండటం విశేషం. ఈ సినిమా చూసి నార్త్ ఇండియా ఆడియన్స్ మాత్రమే కాదు బాలీవుడ్ సెలబ్రిటీలు, సినీ ప్రముఖులు అందరూ ఫిదా అయిపోయారు. ముఖ్యంగా ఈ సినిమాలో పాటలు, అల్లు అర్జున్ మేనరిజమ్స్ ను చూసి ఆశ్చర్యపోయారు.

‘పుష్ప’ రాజ్ స్టైల్ లో అందరూ వీడియోలు చేసి సోషల్ మీడియాలో షేర్ చేయగా, అవి బాగా వైరలయ్యాయి. తాజాగా ఈ చిత్రంలోని ‘సామీ సామీ’ సాంగ్ కు గాను బుడ్డోళ్లు ఇద్దరూ కలిసి చేసిన డ్యాన్స్ వీడియో ఒకటి నెట్టింట బాగా వైరలవుతోంది.

‘కలర్స్’ ప్రోగ్రాంలోని..‘డ్యాన్స్ దివానే జూనియర్స్’..బుడ్డోళ్లు..ఓ బాలుడు, బాలిక.. అల్లు అర్జున్, రష్మిక మందన మాదిరిగా డ్రెస్సులు ధరించి ‘సామీ సామీ’ సాంగ్ కు అదిరిపోయే స్టెప్పులేశారు. ఇక వీరి స్టెప్పులకు జడ్జిలు…బ్యూటిఫుల్ హీరోయిన్ కియారా అద్వానీ, సీనియర్ హీరో అనిల్ కపూర్ తో పాటు మిగతా వారందరూ స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చేశారు. పుష్ప-2 షూటింగ్ త్వరలో స్టార్ట్ కానుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news