మారేడుమిల్లి డీప్ ఫారెస్ట్‌లో పుష్ప‌రాజ్‌!

-

బ‌న్నీ న‌టిస్తున్న తాజా చిత్రం `పుష్ప‌`. 1980ల కాలం నాటి క‌థ‌గా ఈ సినిమా తెర‌కెక్కే అవ‌కాశం వుంద‌ని తెలుస్తోంది. హీరో అల్లు అర్జున్ మేకోవ‌రే ఈ విష‌యాన్ని స్ప‌ష్టం చేస్తోంది. `రంగ‌స్థ‌లం` చిత్రాన్ని ఇదే థీమ్‌తో రూపొందించి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌తో పాటు పలు అవార్డుల్ని ద‌క్కించుకున్న ‌సుకుమార్ మ‌ళ్లీ అదే ఫార్ములాని తీసుకుని `పుష్ప‌` చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు.

మైత్రీ మూవీమేక‌ర్స్ , ముత్యంశెట్టి మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ గ‌త కొన్ని నెల‌లుగా వాయిదా ప‌డుతూ వ‌స్తోంది. తాజాగా ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్‌ని ఈ నెల 10న మారేడుమిల్లిలోని డీప్ ఫారెస్ట్‌లో ప్రారంభించారు. బ‌న్నీతో పాటు ప్ర‌ధాన తార‌గ‌ణం పాల్గొన‌గా ప‌లు కీల‌క ఘ‌ట్టాల‌తో పాటు యాక్ష‌న్ స‌న్నివేశాల్ని చిత్రీక‌రిస్తున్నారు.

గురువారం చిత్ర బృందం విడుద‌ల చేసిన బ‌న్నీ స్టిల్ సినిమా నేప‌థ్యం ఏ టైమ్ పిరియ‌డ్‌లో సెట్ చేశారో స్ప‌ష్టంగా తెలుస్తోంది. మారేడు మిల్లిలోని డీప్ పారెస్ట్‌లో బ‌న్నీ న‌డుస్తున్న పిక్‌ని వ‌న‌క భాగం నుంచి క్లిక్ చేసి రిలీజ్ చేశారు. ఎడ‌మ చేతికి స్టీల్ స్ట్రాప్ వాచ్..తో పాటు బ‌న్నీ చేతి వేళ్ల‌కు వెండి ఉంగరాలు.. రింగులు తిరిగిన జుట్టు..తో ఊర మాస్‌గా బ‌న్నీ క‌నిపిస్తున్నాడు. ఈ ఫొటోకి మైత్రీ మూవీ మేక‌ర్స్ ఓ క్యాప్ష‌న్‌ని జోడించింది. పుష్ప‌రాజ్ వొచ్చేసినాడు.. అంటూ చేసిన ట్వీట్ సోష‌ల్ మీడియాలో సంద‌డి చేస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news