బాలీవుడ్‌పై పుష్ప‌రాజ్ ఫోక‌స్‌.. రంగంలోకి దిగిన డీఎస్పీ!

అల్లు అర్జున్‌కు సౌత్ ఇండియాలో మంచి క్రేజ్ ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న తీసిని సినిమాలు తెలుగుతో పాటు త‌మిళ‌, మ‌ళ‌యాల భాష‌ల్లో కూడా మంచి క‌లెక్ష‌న్లు సాధించాయి. అయితే ఇప్పుడు అంద‌రూ ప్యాన్ ఇండియా సినిమాలు చేస్తుండ‌టంతో బ‌న్నీ గాలి అటువైపు మ‌ళ్లింది. ఇందుకోసం ఇప్ప‌టికే సుకుమార్ కాంబినేష‌న్లో పుష్ప‌ను ప్యాన్ ఇండియ‌న్ మూవీగా తీస్తున్నాడు.

 

ఇందుకోసం అన్ని భాష‌ల అభిమానులు, అక్క‌డి ప‌రిస్థితులను దృష్టిలో పెట్టుకుని జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు సుకుమార్ టీమ్‌. ఇక ఇప్పుడు బాలీవుడ్‌పై మొద‌టిసారి దండ‌యాత్ర చేస్తుండ‌టంతో అక్క‌డి ప్రేక్ష‌కుల‌ను దృష్టిలో పెట్టుకుని ఈ మూవీ ఆడియో ఆల్బ‌మ్‌పై స్పెషల్ కేర్ తీసుకుంటున్నారట.

ఇప్ప‌టికే సౌత్ లో ఎలాగో దేవిశ్రీ ఆడియో గురించి అంద‌రికీ తెలిసిందే. అయితే ఇప్పుడు బాలీవుడ్ హిందీ ఆల్బమ్ పై కూడా డీఎస్పీ స్పెష‌ల్ గా బాణీలు స‌మ‌కూరుస్తున్నారంట‌. ఈ మూవీలో బాలీవుడ్ హీరోయిన్ ఐట‌మ్ సాంగ్ కూడా చేస్తోంది. దీంతో కొంత పాజిటివ్ టాక్ ఉటుందని అంతా భావిస్తున్నారు. ఇందులో ర‌ష్మిక హీరోయిన్‌గా చేస్తోంది. క‌రోనా కార‌ణంగా వాయిదా ప‌డే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం. అదే జ‌రిగితే ఇది ద‌స‌రాకు వ‌చ్చే ఛాన్స్ ఉంది.