సైమా అవార్డులో సత్తా చాటిన పుష్ప చిత్రం.. ఏకంగా..?

-

తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరో అల్లు అర్జున్ అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు. ముఖ్యంగా పాన్ ఇండియా చిత్రంగా పుష్ప సినిమాని విడుదల చేయడంతో ఒక్కసారిగా మరింత పాపులర్ అయ్యారు. ఇక దీంతో అభిమానుల సైతం మరింత మంది పెరిగారని చెప్పవచ్చు. ఇక తాజాగా సైమా 2022 అవార్డుల కార్యక్రమాన్ని బెంగళూరులో చాలా ఘనంగా నిర్వహించారు. ఇక ఈ అవార్డుల కార్యక్రమానికి తెలుగు సినీ ఇండస్ట్రీ నుంచి పెద్ద ఎత్తున సెలెబ్రెటీలు సైతం పాల్గొని సందడి చేయడం జరిగింది. ఇక ఈ వేడుకలు రెండు రోజులపాటు జరగనున్నాయి. అక్కడికి విజయ్ దేవరకొండ తో పాటు అల్లు అర్జున్ కూడా ఈ వేడుకలలో పాల్గొని సందడి చేశారు.

తెలుగు సినీ ఇండస్ట్రీ నుంచి ఎన్నో చిత్రాలు నామినేషన్లు ఉండడం జరిగింది.ముఖ్యంగా అందులో అఖండ, జాతి రత్నాలు, ఉప్పెన, పుష్ప వంటి సినిమాలు సైమా నామినేషన్లు ఉన్నాయి. ఇక ఈ అవార్డులు వేడుకలో భాగంగా పుష్ప చిత్రానికి అన్ని కేటగిరీలో కూడా అవార్డులను అందుకొని రికార్డు సైతం సృష్టించింది. ఈ చిత్రానికి మొత్తం 6 కేటగిరీలలో అవార్డు సొంతం చేసుకున్నది. అందులో ఉత్తమ నటుడుగా, ఉత్తమ సహాయ నటుడుగా, ఉత్తమ డైరెక్టర్ గా, ఉత్తమ సాహిత్య రచయితగా, ఉత్తమ చిత్రం, ఉత్తమ సంగీత దర్శకుడుగా.. ఇలా అన్నిటిలో కూడా ఈ సినిమా అవార్డులను అందుకోవడం విశేషమని చెప్పవచ్చు.

ఈ వేడుకలో భాగంగా అల్లు అర్జున్ ఉత్తమ నటుడు అవార్డుని అందుకోవడంతో అల్లు అర్జున్ అభిమానులు సైతం చాలా సంబరపడిపోతున్నారు. ఇక అంతే కాకుండా ఈ చిత్రానికి 6 భాగాలలో అవార్డులు రావడంతో మరింత ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అల్లు అర్జున్ అందుకు సంబంధించి ఒక ఫోటోను కూడా సోషల్ మీడియాలో షేర్ చేయడం జరిగింది. తనని ఈ స్థాయికి తీసుకువచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు కూడా తెలియజేశారు.

Read more RELATED
Recommended to you

Latest news