ఎట్టకేలకు పుష్ప రష్యా వసూళ్ళు వచ్చాయి.. హిట్టేనా!!

-

అల్లు అర్జున్ అంటే తెలుగు ప్రజలలో విపరీతమైన క్రేజ్ వుంది.ఇక పుష్ప తర్వాత తన ఫాలోయింగ్ మామూలుగా లేదు.సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన‘పుష్ప’ సినిమా ఊహించని  వసూళ్లు సాధించి బ్లాక్ బస్టర్ హిట్టయిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాలో పాటలు , స్టైల్స్ అన్ని విపరీతంగా ఆదరణ పొందాయి. ఇప్పుడు పుష్ప 2కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇప్పుడు పుష్ప 2 స్క్రిప్ట్ కోసం సుకుమార్ చాలా టైమ్ కేటాయించి పనిచేశారు. ఈ సారి కేజీఫ్ కంటే ఎక్కువ మోతాదులో ట్విస్టులు మరియు యాక్షన్ ఎపిసోడ్స్ పెట్టుకున్నారట.అయితే రీసెంట్ గా ఈ సినిమా రష్యా లో విడుదల సందర్భంగా అల్లు అర్జున్, సుకుమార్, రస్మిక అక్కడకు వెళ్లి ఫ్యాన్స్ తో హంగామా చేశారు. ఇక అల్లు అర్జున్ ఈ గ్యాప్ లో తన క్రేజ్ తో చాలా యాడ్స్ చేసుకుంటూ వెళ్ళాడు. ఇవి పాన్ ఇండియా స్థాయిలో హల్చల్ చేస్తున్నాయి.

ఇక ఈ సినిమా రష్యా విడుదల అయిన సంగతి తెలిసిందే. దీని కోసం అల్లు అర్జున్, సుకుమార్, రస్మిక అందరూ రష్యా వెళ్లి ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కాని విడుదల అయిన ఇన్ని రోజులు అవుతున్నా కాని అక్కడి వసూళ్ళు వివరాలు చెప్పలేదు. కాని జపాన్ లో ఆర్ ఆర్ ఆర్ మూవీ వసూళ్ళు మాత్రం ప్రతి వారం ఇచ్చారు. ఎట్టకేలకు రష్యా లో వసూళ్ళు వివరాలు వచ్చాయి.రష్యాలో ‘ఫుష్ప : ది రైజ్’ ప్రస్తుతం 774 స్క్రీన్‌లలో విజయవంతంగా కొనసాగుతోందని తెలిపారు. 25 రోజుల్లో మన రూపాయల్లో కోటి ,13 లక్షల రూపాయల కలెక్షన్స్ ను రాబట్టిందని.. మేకర్స్ తెలిపారు.

 

Read more RELATED
Recommended to you

Latest news