శంక‌ర్‌కు త‌ల‌నొప్పిగా మారిన ఆర్ ఆర్ ఆర్.. ఎందుకంటే?

ద‌ర్శ‌క దిగ్గ‌జం రాజ‌మౌళి తీస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమాపై ఏ స్థాయి అంచ‌నాలు ఉన్నాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్‌క‌లిసి న‌టిస్తుండ‌టంతో అంచ‌నాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అయితే గ‌త రెండేళ్లుగా చేస్తున్న ఈ సినిమా షూటింగ్‌తో ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్‌లు వేరే సినిమాల‌ను చేయ‌లేకపోతున్నారు. వారి కోసం చాలామంది డైరెక్ట‌ర్లు వెయిట్ చేస్తున్నారు.

వాస్త‌వానికి ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ కావాల్సి ఉంది. కానీ కరోనా కార‌ణంగా ఇప్పుడు రెండు నెలల షూటింగ్ మిగిలి ఉంద‌ని తెలుస్తోంది. ఈ కార‌ణంగా అస‌లు ఈ మూవీ ఎప్పుడు పూర్తి అవుతుందా అని చాలామంది ఎదురు చూస్తున్నారు. ఇక రామ్ చరణ్ ఈ సినిమా త‌ర్వాత శంకర్ దర్శకత్వంలో భారీ మూవీ చేసేందుకు ఫిక్స్ అయ్యాడు.

ఇక మొన్న‌టి వ‌ర‌కు చ‌ర‌ణ్‌, శంక‌ర్‌ల సినిమా జులై లో షూటింగ్ స్టార్ట్ అవుతుంద‌ని తెలిసింది. కానీ ఇప్పుడున్న ప‌రిస్థితుల‌ను బ‌ట్టి చూస్తుంటే ఈ క్రేజీ ప్రాజెక్టు మ‌రింత ఆలస్యం అయ్యేలా క‌నిపిస్తోంది. ఆర్ఆర్ఆర్ సినిమా అనుకున్న స‌మ‌యానికి షూటింగ్ అయ్యేలా లేదు. దీంతో ఈ ఏడాది చివరి వరకు చ‌ర‌ణ్ తో సినిమా స్టార్ట్ చేసేలా ఉన్నాడు శంక‌ర్‌.