కరోనా కారణంగా అనాధలైన పిల్లల దత్తతపై సుప్రీం కోర్ట్ చెప్పిన విషయాలు..

కరోనా సృష్టించిన విలయతాండవం అంతా ఇంతా కాదు. సెకండ్ వేవ్ లో ఎంతో మంది మరణించారు. ఒకే కుటుంబంలో తల్లి, తండ్రి మరణించడంతో పిల్లలు అనాధలయ్యారు. ఈ నేపథ్యంలో వారి బాధ్యతను తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు వచ్చాయి. కానీ తాజా సమాచారం ప్రకారం కరోనా కారణంగా అనాధలైన వారి విషయమై కీలక ఆదేశాలు జారీ చేసింది. కరోనా వల్ల అయినవాళ్ళను పోగొట్టుకున్న వారి వివరాలను సోషల్ మీడియాలో ఉంచరాదని, వారి పేర్లను ఉపయోగించి చందాలు వసూలు చేయరాదని సూచించింది.

చట్టవిరుద్ధంగా జరిగే దత్తత కార్యక్రమాలను అడ్డుకోవాలని, ఇలాంటి విషయాల్లో ప్రభుత్వాలు సీరియస్ గా ఉండాలనీ, అనవసరమైన ప్రకటనలు చేయకూడదని తెలిపింది. కరోనా వల్ల అనాధలైన వారిని దత్తత తీసుకోవడానికి కొన్ని షరతులతో కూడిన నియమాలను సూచించింది. వాటి ప్రకారమే దత్తత జరగాలని, చట్టవిరుద్ధమైన వాటిని అడ్డుకోవాలని కోరింది.