త్వరలో రేసుగుర్రం 2 .. అల్లు అర్జున్ నెక్స్ట్ ప్రాజెక్ట్ లాక్ …!

-

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ లో రేసుగుర్రం సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని వక్కంతం వంశీ కథ తో సురేందర్ రెడ్డి తెరకెక్కించాడు. ఇప్పుడు ఈ ముగ్గురు కలిసి ఈ సినిమా సీక్వెల్ కి రెడి కాబోతున్నారని తాజా సమాచారం. మెగా పవర్ స్టార్ రాం చరణ్ నిర్మాతగా మెగాస్టార్ చిరంజీవి తో సైరా సినిమా ని తెరకెక్కించి హిట్ అందుకున్నాడు సురేందర్ రెడ్డి. ఆ తర్వాత ప్రభాస్ తో సినిమా చేయాలనుకున్నాడు. కాని కుదరలేదు. అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు తోను ప్రాజెక్ట్ సెట్ చేసుకోవలనుకున్నాడు. ఎందుకనో అది వర్కౌట్ కాలేదు.

 

దాంతో ఇప్పుడు దర్శకుడు సురేందర్ రెడ్డి, రచయిత వక్కంతం వంశీ కలిసి రేసు గుర్రం 2 కోసం కథను తయారుచేసే పనిలో పడ్డారని లేటెస్ట్ న్యూస్. ఇక అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కన్నడ బ్యూటి రష్మిక మందన్న ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. సుకుమార్, అల్లు అర్జున్ సినిమా కంప్లీటయ్యో సరికి స్క్రిప్ట్ రెడీ చేసి, బన్నీ తో సినిమా చేయాలని సురేందర్ రెడ్డి సన్నాహాలు చేస్తున్నారట. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ కోసం అద్భుతమైన కథ ని రెడి చేస్తున్నారు.

ఇక ఈ సినిమాని గీతా ఆర్ట్స్ బ్యానర్ మీదే నిర్మిస్తారట. వాస్తవంగా సుకుమార్ తర్వాత అల్లు అర్జున్ .. ఏ.ఆర్ మురగదాస్ తెరకెక్కించబోయో సినిమాలో నటిస్తాడని ఆ మద్య ప్రచారం జరిగింది. అల్లు అర్జున్ తో కథా చర్చలు జరుగుతున్నాయని గజనీ కి సీక్వెల్ గా ఈ సినిమా రూపొందబోతుందని అన్నారు. అయితే ప్రస్తుతానికి ఆ ప్రాజెక్ట్ ని అల్లు అర్జున్ పక్కన పెట్టేసినట్టు తెలుస్తుంది. అంతేకాదు ఇప్పుడున్న పరిస్థితులని బట్టి అల్లు అర్జున్ నెక్స్ట్ చేయబోయో సినిమా సురేందర్ రెడ్డి తోనే అని గీతా సంస్థ నుండి వినిపిస్తున్న మాటలు. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి అఫీషియల్ న్యూస్ త్వరలో రానుందని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version