నన్ను ఒకే రోజు ఇద్దరు… రాధికా ఆప్టే సంచలన వ్యాఖ్యలు…!

-

రాధికా ఆప్టే” ఎన్ని సినిమాలు చేసినా సరే రాని పాపులారిటి ఈ భామకు వచ్చింది. పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాల్లోకి అడుగుపెట్టిన ఈ భామ, అన్ని విధాలుగాను అభిమానులను ఆకట్టుకుంది. ఒక పక్కన నటన మరో పక్క అందంతో ఆకట్టుకున్న ఈ భామ, చీర కట్టు నుంచి నగ్నం వరకు అన్ని విధాలుగాను కనపడింది. ఏ విషయాన్ని అయినా సరే బోల్డ్ గా మాట్లాడటం ఈ భామ సొంతం.

తెలుగులో లెజెండ్ సినిమా చేసిన తర్వాత తెలుగు హీరోల పక్కన గుర్తింపు ఉండదు అంటూ ఆమె సంచలన వ్యాఖ్యలు చేసింది. తాజాగా తన వ్యక్తిగత జీవితం గురించి ఒక ఆసక్తికర విషయాన్ని అభిమానులకు చెప్పింది. తానెప్పుడు తనకంటే చిన్న వయసు వారితో డేటింగ్ చేయలేదని చెప్పిన ఈ భామ, ఒక విషయం మాత్రం నిజమని, పెళ్లికి ముందు ఒకే రోజు ఇద్దరు అబ్యాయిలు తనను డేటింగ్ కు రమ్మన్నారని. వారిలో తన భర్త బెనెడిక్ట్ ఒకరని చెప్పుకొచ్చింది. ఆ సమయంలో తాను ఏ నిర్ణయం తీసుకులేకపోయానని చెప్పింది.

తన రూంమేట్ కు విషయం చెప్పి ఓ నిర్ణయం తీసుకున్నామని చెప్పుకొచ్చింది. టూనా చేపను వండి మా ఇంటికి వచ్చే పిల్లికి పెట్టాలనుకున్నామని, పిల్లి ఆ వంటకాన్ని తింటే మాత్రం బెనెడిక్ట్ తో డేటింగ్ కు వెళ్లాలని.. తినకపోతే మరో కుర్రాడితో డేటింగ్ కు వెళ్లాలని నిర్ణయించుకున్నా అంటూ ఆసక్తికర విషయం చెప్పింది. ఆ పిల్లి చేపను తినడంతో తాను బెనెడిక్ట్ తో డేటింగ్ వెళ్లానని చెప్పుకొచ్చింది. చివరికి ఆయన్నే పెళ్లి చేసుకున్నానని చెప్పింది. పెళ్లి తర్వాత ఆమె ఎలాంటి అభ్యంతరం లేకుండా నగ్నంగా కూడా నటించింది.

Read more RELATED
Recommended to you

Latest news