శిష్యుణ్ని చెప్పుతో కొట్టిన సింగర్.. వీడియో వైరల్

-

ప్రముఖ పాకిస్థాన్, బాలీవుడ్ సింగర్ రాహత్ ఫతేహ్ అలీఖాన్ తన శిష్యుణ్ని చెప్పుతో కొడుతున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఓ బాటిల్ కనిపించకపోవడంతో రాహత్ అతడిని కొట్టినట్లు తెలుస్తోంది. తనని వదిలేయాలంటూ బాధితుడు బతిమలాడుతుంటడం ఆ వీడియోలో గమనించొచ్చు. ఈ వీడియో చూసిన నెటిజన్లు రాహత్ ప్రవర్తనపై తీవ్రంగా మండిపడుతున్నారు. దీంతో దిగొచ్చిన రాహత్ ఆ వీడియోపై క్లారిటీ ఇచ్చాడు. అందులో ఉన్నది ఆయనే అని చెప్పి వివరణ ఇచ్చిన ఆయన తన శిష్యుడికి క్షమాపణలు చెప్పాడు.

ఇది గురు, శిష్యుల మధ్య విషయం. బాధితుడు నా సొంత శిష్యుడే. నా కుమారుడిలాంటి వాడు. శిష్యుడు తప్పు చేస్తే గురువు దండించినట్లుగానే దీన్ని భావించాలి. గొడవ తర్వాత అతడికి క్షమాపణ చెప్పాను అని రాహత్ క్లారిటీ ఇచ్చాడు. మరోవైపు ఈ ఘటనపై వివరణ ఇచ్చిన వీడియోలో బాధితుడు మాట్లాడుతూ.. పవిత్ర జలానికి సంబంధించిన ఓ బాటిల్ కనిపించకుండా పోవడం పట్ల రాహత్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిపారు. దానికి తానే కారణమని, అందుకే ఫతేహ్‌ అలీ ఖాన్‌ అలా దండించారని తెలిపారు.

 

Read more RELATED
Recommended to you

Latest news