ఫిబ్రవరిలో బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవులో తెలుసా?

-

బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్. 2024 ఫిబ్రవరి నెలకు సంబంధించిన సెలవుల జాబితాను తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. కస్టమర్లు ఈ సెలవులను దృష్టిలో ఉంచుకుని తమ కార్యకలాపాలు ప్లాన్ చేసుకోవాలని సూచించింది. ఈ సెలవుల్లో జాతీయ సెలవులు సహా, కొన్ని ప్రాంతీయ సెలవులు కూడా ఉన్నాయి.

2024 ఫిబ్రవరి నెలలో బ్యాంక్ సెలవుల జాబితా

ఫిబ్రవరి 4 (ఆదివారం)

ఫిబ్రవరి 10 (రెండో శనివారం)

ఫిబ్రవరి 11 (ఆదివారం)

ఫిబ్రవరి 14 (బుధవారం) : వసంత పంచమి/ సరస్వతి పూజ సందర్భంగా త్రిపుర, ఒడిశా, బంగాల్ల్లోని బ్యాంకులకు సెలవు

ఫిబ్రవరి 15 (గురువారం) :లుయి-న్గై-ని పండుగ సందర్భంగా మణిపుర్లోని బ్యాంక్లకు సెలవు.

ఫిబ్రవరి 18 (ఆదివారం)

ఫిబ్రవరి 19 (సోమవారం) : ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా మహారాష్ట్రలోని బ్యాంకులకు సెలవు ఉంటుంది.

ఫిబ్రవరి 20 (మంగళవారం) : రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా అరుణాచల్ప్రదేశ్, మిజోరంల్లోని బ్యాంకులకు సెలవు ఉంటుంది.

ఫిబ్రవరి 24 (నాల్గో శనివారం)

ఫిబ్రవరి 25 (ఆదివారం)

ఫిబ్రవరి 26 (సోమవారం) : న్యోకుమ్ పర్వదినం సందర్భంగా అరుణాచల్ ప్రదేశ్ లోని   బ్యాంకులకు సెలవు.

Read more RELATED
Recommended to you

Latest news