ఆర్.ఆర్.ఆర్ లో అతను కన్ఫాం..!

-

బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న ట్రిపుల్ ఆర్ మూవీలో ఎన్.టి.ఆర్, రాం చరణ్ లు నటిస్తున్నారని తెలుసిందే. అయితే ఈ సినిమాలో మరో నటుడు కన్ ఫాం అయ్యాడు. అతనే కమెడియన్ రాహుల్ రామకృష్ణ. అర్జున్ రెడ్డి సినిమాలో అతను చేసిన కామెడీ అందరికి గుర్తుంది. ఆ సినిమాతో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న రాహుల్ రామకృష్ణ మహేష్ భరత్ అనే నేను సినిమాలో కూడా మంచి రోల్ చేశాడు.

ఇక ఇప్పుడు ఏకంగా ట్రిపుల్ ఆర్ లో ఛాన్స్ కొట్టేశాడట రాహుల్. ఈ విషయాన్ని తానే స్వయంగా చెప్పాడు. ఆర్.ఆర్.ఆర్ లో చేస్తున్నా అంటూ ఎనౌన్స్ చేసిన రాహుల్ అది ఎలాంటి పాత్ర అన్నది మాత్రం చెప్పలేనని చెప్పాడు. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్స్ విషయంలో ఎలాంటి క్లారిటీ రాలేదు.

నవంబర్ 11న సెట్స్ మీదకు వెళ్లిన ఈ సినిమా తెలుగు, తమిళ, హింది భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు. పిరియాడికల్ డ్రామాగా వస్తున్న ఈ సినిమా 2020లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version