టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ రిలేషన్షిప్లో ఉన్నాడా? ఏమో.. శేష్ మాత్రం సింగిల్ కాదట. ఈ విషయాన్ని శేష్ స్నేహితుడు, నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ రివీల్ చేశారు. అడివి శేష్ రిలేషన్షిప్లో ఉన్నాడంటూ చాలా సార్లు రూమర్స్ వచ్చినా.. అవి అఫీషియల్ కాదు. అయితే తాజాగా రాహుల్ శేష్ లవ్ లైఫ్పై క్లారిటీ ఇచ్చారు.
తాజాగా అడివి శేష్, రాహుల్ రవీంద్రన్ ఆహాలో ఆహా చెఫ్ అనే కార్యక్రమానికి హాజరయ్యారు. నిహారిక హోస్ట్గా వ్యవహరిస్తున్న ఈ షో లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో తాజాగా విడుదలైంది. ఇందులో నిహారిక మాట్లాడుతూ ‘ఎయిట్ తర్వాత వస్తుంది 9, మా శేష్ సింగిల్ కాబట్టి అమ్మాయిలు వేసుకోవచ్చు లైన్’ అంటూ ఒక పంచ్ డైలాగ్ వేయగా.. రాహుల్ రియాక్ట్ అవుతూ.. ‘అడివి శేష్ సింగిల్ అని ఎవరు చెప్పారు’ అంటూ ఒక్కసారిగా సడెన్ షాక్ ఇచ్చారు.
దీంతో అడివి శేష్ లవ్ స్టోరీ ఏమైనా ఉందా అని పక్కన ఉన్నవారికి ఆలోచించే లోగా రాహుల్ మళ్లీ తన మాటలను కవర్ చేస్తూ.. ‘శేష్ సింగిల్ కాదు మల్టిపుల్’ అంటూ మరో కౌంటర్ వేశారు. మూడు నిమిషాల పాటు సాగిన ఈ ప్రోమో నవ్వులు పూయిస్తూ ఆసక్తికరంగా సాగింది.