ఆర్ఆర్ఆర్ మూవీ పుకార్ల‌తో ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి ఆవేద‌న‌..? ఈ నెల 14న ప్రెస్‌మీట్‌..?

-

ఆర్ఆర్ఆర్ మూవీపై వ‌స్తున్న పుకార్ల‌కు చెక్ పెట్టేందుకు రాజ‌మౌళి ఓ నిర్ణ‌యం తీసుకున్నార‌ట‌. ఈ క్ర‌మంలోనే ఆయన ఆ పుకార్ల‌కు చెక్ పెడుతూ ఈ నెల 14వ తేదీన ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించి ఓ ప్రెస్ మీట్ పెడుతున్నార‌ట‌.

- Advertisement -

సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి తాను తీసే ఏ చిత్రం ప‌ట్ల‌నైనా స‌రే.. చాలా జాగ్ర‌త్త‌గా ఉంటార‌నే విష‌యం తెలిసిందే. క‌థ ద‌గ్గ‌ర్నుంచీ ఆ సినిమాలో న‌టించే న‌టులు, ప‌నిచేసే సాంకేతిక నిపుణులు, క్యారెక్ట‌ర్ ఆర్టిస్టులు.. ఇలా అన్ని అంశాల్లోనూ ఆయ‌న జాగ్ర‌త్త‌గా ఉంటారు. సినిమాకు సంబంధించిన ఏ విష‌యం కూడా బ‌య‌ట‌కు పొక్క‌కుండా చూసుకుంటారు. అయితే ఈ మ‌ధ్య కాలంలో ఆయ‌న తాజాగా తెర‌కెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ ప‌ట్ల వ‌స్తున్న అనేక పుకార్లు ఆయ‌న్ను ఇబ్బందుల‌కు గురి చేశాయ‌ట‌. దీంతో ఆయ‌న ఈ విష‌యంపై కొంత బాధ ప‌డిన‌ట్లు తెలిసింది.

అయితే ఆర్ఆర్ఆర్ మూవీపై వ‌స్తున్న పుకార్ల‌కు చెక్ పెట్టేందుకు రాజ‌మౌళి ఓ నిర్ణ‌యం తీసుకున్నార‌ట‌. ఈ క్ర‌మంలోనే ఆయన ఆ పుకార్ల‌కు చెక్ పెడుతూ ఈ నెల 14వ తేదీన ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించి ఓ ప్రెస్ మీట్ పెడుతున్నార‌ట‌. అందులో ఆ సినిమాకు చెందిన ప‌లు విశేషాల‌ను ఆయనే స్వ‌యంగా వెల్ల‌డిస్తార‌ని తెలిసింది. కాగా గ‌తంలో ఆర్ఆర్ఆర్ మూవీకి గాను బాలీవుడ్ న‌టి ఆలియా భ‌ట్‌ను న‌టించమ‌ని రాజ‌మౌళి అడిగితే.. అందుకు ఆమె డేట్స్ ఖాళీ లేవ‌ని చెప్పింద‌ట‌. అయిన‌ప్ప‌టికీ త‌న టీంను పంపి మ‌రోసారి ఆమెను సినిమా కోసం ఒప్పించే ప్ర‌య‌త్నం చేశార‌ట రాజ‌మౌళి. రెమ్యున‌రేష‌న్ భారీగా ఇస్తామ‌న్నా ఆలియా కుద‌ర‌దు, డేట్స్ ఖాళీ లేవు, తాను డ‌బ్బు మనిషిని కాను.. అని చెప్పింద‌ట‌.

అయితే ఆలియాభ‌ట్‌ను రాజ‌మౌళి టీం నిజంగానే సంప్ర‌దించిందో, లేదో కానీ.. ఆ విష‌యంపై మాత్రం భారీగానే పుకార్లు షికార్లు చేశాయి. ఈ క్ర‌మంలో ఆ వార్త‌ల‌పై రాజ‌మౌళి ఆవేద‌న చెందార‌ని తెలిసింది. అందుకే ఆయ‌న ఈ నెల 14న ప్రెస్ మీట్ పెట్టి ఆర్ఆర్ఆర్ మూవీ విశేషాల‌ను వెల్ల‌డిస్తార‌ని తెలుస్తోంది. కాగా ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చ‌ర‌ణ్ తేజ‌, ఎన్టీఆర్‌లు న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమాను రూ.300 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో ప్ర‌ముఖ నిర్మాత డీవీవీ దాన‌య్య నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రం ఎప్పుడు ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుందో వేచి చూడాలి..!

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...