దిగ్గజ దర్శకుడికి విలువ కట్టలేని అక్షర రూప నివాళి అర్పించిన రాజమౌళి.!

-

కళాతపస్వి కె విశ్వనాథ్ మృతి సినీ పరిశ్రమని తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసింది. ఆయన చేసిన సినిమాలు ఒక్కొక్కటి ఒక్కో అద్భుత కళాకండం.. ఆయనకు మాత్రమే సాద్యమయ్యే క్లాసికల్  సినిమాలను తీసి తెలుగు సినీ ప్రేక్షక హృదయాలను రంజింప చేశారు కె విశ్వనాథ్. ఆయన మరణ వార్త విన్న సినీ ప్రముఖులు విశ్వనాథ్ గారితో తమకున్న అనుబంధాన్ని పంచుకుంటూ సోషల్ మీడియాలో స్పందన తెలియచేస్తున్నారు.

ఆయన చేసిన సినిమాలు చూస్తూ ఆయన్ని గుర్తు చేసుకుంటూ కన్నీళ్ల పర్యంతమయ్యారు. సినిమా అంటే ఎలా తీయాలి అనేది ఆయన సినిమాలు చూసి నేర్చుకోవచ్చు. ఆయన సినిమా చేస్తున్న కాలం లో కాకి బట్టలు వేసుకొని అకుంఠిత దీక్షతో అదొక పూజ లాగా నిష్టతో, నిబద్దత తో చేస్తారు. సినిమా అనేది వ్యాపారం కాదు అది ఒక కళాత్మక సృష్టి అని తన సినిమాల ద్వారా చాటి చెప్పారు.ఈ సినిమా పరిశ్రమ లో డైరెక్టర్  పేరుకు కు గౌరవం తెప్పించిన దర్శక దిగ్గజం.

తాజాగా ఆయన మృతి పట్ల దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి స్పందిస్తూ ఆయన్ను లెజెండ్ గా తెలుగు సినిమా దేవుడి గా గుర్తు చేసుకుంటూ నివాళి అర్పించారు. రాజమౌళి ట్విట్టర్ లో ప్రపంచం లో ఎవరైనా మీ తెలుగు సినిమా గొప్పదనం ఏంటి అని అడిగితే, మాకు కే. విశ్వనాథ్ గారు ఉన్నారు అని రొమ్ము విరిచి గర్వం గా చెప్పుకుంటాం. తెలుగు సినిమా లో అతని ఆర్ట్ ఎప్పటికీ బ్రైట్ గా నిలిచి పోతుంది అని అన్నారు. సినిమా గ్రామర్ లో మీరు నేర్పిన పాత్రలకు ఆజన్మాంతం రుణపడి ఉంటాం అంటూ తనదైన శైలిలో నివాళి అర్పించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news