ట్రిపుల్ ఆర్ టీజర్ వచ్చేస్తుంది

-

బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న మెగా మల్టీస్టారర్ ఆర్.ఆర్.ఆర్ సినిమాకు బాహుబలి లాంటి ప్రమోషనల్ యాక్టివిటీస్ కు రంగం సిద్ధం చేస్తున్నాడు. రీసెంట్ గా ముహుర్తం పెట్టుకున్న ఈ సినిమా ఈరోజు నుండి సెట్స్ మీదకు వెళ్తుంది. అయితే సినిమాపై ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఉండేలా సినిమా టైటిల్ తో పాటుగా టీజర్ కూడా ఈ నెల చివరి కల్లా రిలీజ్ చేయాలని చూస్తున్నాడట రాజమౌళి.

దానికి సంబందించిన షూటింగ్ ఈ వారం జరుగుతుందట. మొదటి టీజర్ లో ఇద్దరి హీరోల లుక్.. టైటిల్ తో కథ ఏంటి అన్నది ఆడియెన్స్ మైండ్ లో ఫిక్స్ అయ్యేలా చేస్తున్నాడట. మొత్తానికి సినిమా ప్రమోషన్స్ లో జక్కన్న పంథా వేరని తెలిసిందే. మరి రాబోతున్న ఈ ట్రిపుల్ ఆర్ ఫస్ట్ లుక్ టీజర్ ఎలా ఉండబోతుందో చూడాలి.

ఎన్.టి.ఆర్, చరణ్ ఇద్దరు తమదైన శైలిలో కనిపిస్తారట. ముఖ్యంగా తారక్ ఈ సినిమాలో డిఫరెంట్ రోల్ చేస్తాడని తెలుస్తుది. నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర అని టాక్. చరణ్, ఎన్.టి.ఆర్ మల్టీస్టారర్ గా వస్తున్న ఈ ఆర్.ఆర్.ఆర్ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news