‘తెలంగాణా దేవుడు’ ట్రైలర్ రిలీజ్

-

తెలంగాణా రాష్ట్రం ఏర్పాటుకి ప్రధాన కారకుడు. తెలంగాణా ఉద్యమ నేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జీవిత చరిత్రతో ఓ సినిమా వస్తుంది. ఆ సినిమాకు టైటిల్ తెలంగాణా దేవుడు అని ఫిక్స్ చేశారు. శ్రీకాంత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు చిత్రయూనిట్. చిన్ననాటి నుండి సిఎంగా ప్రమాణ స్వీకారం చేసినంత వరకు కెసిఆర్ జీవిత చరిత్రతో ఈ సినిమా వస్తుంది.

సినిమా ట్రైలర్ చూస్తే అంత ఆసక్తికరంగా అనిపించలేదు. అయితే సినిమా ఆయన బయోపిక్ అయినా సినిమాలో అలా కాకుండా విజయ్ దేవ్ అనే పేరుని పెట్టారు. ఈ ట్రైలర్ దాదాపు 6 నిమిషాలకు పైగా ఉంది. సినిమా మొత్తం కవర్ చేసిన అంశాలన్ని కలిపి ట్రైలర్ గా కట్ చేశారు. మేకింగ్ నాసిరకంగా అనిపిస్తుండగా సినిమాలో టీనేజ్ లో హీరో రోల్ చేసిన అతను ఆకట్టుకోలేదు. ఇక హీరోయిన్ సంగతి సరేసరి.

తెలంగాణా దేవుడు అనే పవర్ ఫుల్ టైటిల్ తో శ్రీకాంత్ ను లీడ్ రోల్ పెట్టి చేస్తున్న ఈ ప్రయత్నం ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి. హరీష్ వద్య డైరెక్ట్ చేసిన ఈ సినిమా మహ్మద్ జాకీర్ ఉస్మాన్ నిర్మిస్తున్నారు. మరి ఈ సినిమా ఏమేరకు ప్రజలను మెప్పిస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news