ఈరోజు జరుగుతున్న ఏపి ఎలక్షన్స్ కోసం ఆర్.ఆర్.ఆర్ యూనిట్ మొత్తం ఖాళీ అయ్యిందట. ఇది ఎవరో చెబుతున్న మాట కాదు స్వయంగా దర్శకధీరుడు రాజమౌళి ట్వీట్ చేశాడు. ఓటు హక్కు వినియోగించుకోవడం మంచిది.. ఆర్.ఆర్.ఆర్ సగం యూనిట్ ఖాళీ అయ్యింది. పార్టీ కాని, నాయకుడు కాని నచ్చకుంటే మీరు నోటా నొక్కండి అంటూ ట్వీట్ చేశాడు రాజమౌళి.
సాధారణ ప్రజలతో పాటుగా సెలబ్రిటీస్ కూడా తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఇప్పటికే స్టార్స్ తమ ఓటు వేసిన పిక్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇక ఆర్.ఆర్.ఆర్ సినిమా విషయానికొస్తే రాం చరణ్ గాయం కారణమా సినిమా ఓ 3 వారాల పాటు వాయిదా పడింది. మరి మళ్లీ రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలియాల్సి ఉంది.
Half of my unit members left to their towns and villages to exercise their vote… Good… Do Vote… If you think no party/candidate makes a difference, make use of nota.. #IndiaElections2019 #LokSabhaElections2019 #VoteForIndia pic.twitter.com/M1y4egqDjn
— rajamouli ss (@ssrajamouli) April 11, 2019