రాజకీయ చాణక్యుడు, హైదరాబాద్‌ను ప్రపంచ పటంలో పెట్టిన చంద్రబాబులో ఓటమి భయం కనిపిస్తోంది.. అందుకే రోజుకో కొత్త నాటకానికి తెరతీస్తున్నారా?? అంటే అవుననే అనిపిస్తున్నది. నరంలేని నాలుక ఎలాగైనా మడత పడుతుందన్నట్లు.. అసలేం మాట్లాడుతున్నారో అర్థం కాకుండా.. మొన్నటివరకు బీజేపీని ఆకాశానికి ఎత్తినా.. ఆపై చెడామడా తిట్టినా.. సోనియాగాంధీని ఇటలీ దెయ్యం అని దూషించినా.. అవసరమైతే దేవతగా కీర్తించినా.. ఎన్నికల సంఘాన్ని ప్రశంసించినా.. మళ్లీ తిట్టినా ఆ ఘనత బాబుకే చెందుతుంది…
ఎన్నికలకు ఒకరోజు ముందు ఎన్నికల సంఘంపై నిరసనతో కొత్త నాటకం మొదలుపెట్టారు. ఓడిపోతే ఈవీఎంలపై నెపం నెట్టేందుకు రెడీ అయిపోయారు బాబు గారు.. ఎలక్షన ఈసీ ఎవరు? ఎన్నికల సంఘాన్ని మూసేయండి. మేం చూస్తాం. ఎలక్షన్ కమిషన్ ఏంటో? అంత ఈజీగా వదిలిపెట్టను. కేంద్రం ఎన్నికల సంఘం చెప్పినట్టు వినాల్సిన పనిలేదు.. అంటూ ఎన్నికల సంఘంపై విరుచుకు పడ్డతీరు చర్చనీయాంశంగా మారింది.
ఆతీరా ఎన్నికలు జరుగుతుండగా రీపోలింగ్ డిమాండ్ చేయడం వెనుక ఓటమి భయం కొట్టొచ్చినట్లు కన్పిస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 30 శాతం ఈవీఎంలు సరిగా పనిచేయడం లేదన్నది నిజం.. ఈ విషయాన్నిఎన్నికల సంఘం కూడా ఒప్పుకుంది.ఎన్నికలు ప్రశాంతంగా జరగాలంటే బాబు లాంటి నాయకులు సహకరించాలి.. అందునా అధికార పార్టీ అయ్యుండి ఇలా ఈసీని భయభ్రంతులకు గురిచేయడం తగదు.. బాబు చేసే ఇలాంటి చీప్ పనులవలతో టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టినట్టే, ప్రజలను కన్ప్యూజ్ చేసినట్లే అవుతుంది.
నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు ఇప్పుడు ఓటమి భయంతో ఇలా చేయడం తగదు…
– RK