రాజమౌళి జాగ్రత్తలు అన్నీ ఇన్ని కావుగా…!

-

ఆర్ఆర్ఆర్… ఇప్పుడు టాలీవుడ్ లో ఈ సినిమా మీద ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు. ఈ సినిమాకు సంబంధించి ఏ వార్త బయటకు వచ్చినా సరే జనాలు అలాగే చూస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా దీనికి సంబంధించిన హడావుడి ఒక స్థాయిలో ఉందీ అనేది వాస్తవం. ఇక ఈ సినిమా లుక్స్ ఎలా ఉంటాయి…? కొమరం భీమ్ గా ఎన్టీఆర్ ఎలా ఉంటున్నాడు…? రామ్ చరణ్, అల్లూరి సీతారామరాజు గా ఎలా ఉంటాడు…?

ఇతర పాత్రలు ఎలా ఉంటాయి…? ఇలా ప్రతీ ఒక్కటి కూడా ఆసక్తికరంగానే ఉన్నాయి. ముఖ్యంగా ఎన్టీఆర్, రామ్ చరణ్ లుక్స్ కోసం ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. ఈ సినిమా వాయిదా పడటంతో కనీసం లుక్స్ అయినా విడుదల చెయ్యాలి అంటూ అభిమానులు కోరడంతో త్వరలో లుక్స్ బయటకు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ఎన్టీఆర్ లుక్ మే లో విడుదల అవుతుంది అంటున్నారు.

జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు అప్పుడు ఉండటంతో ముందు రామ్ చరణ్ లుక్ విడుదల చేస్తారు. వచ్చే నెలలో రామ్ చరణ్ పుట్టిన రోజు ఉంది. ఇక ఈ లుక్స్ విషయంలో రాజమౌళి చాలా జాగ్రత్త పడుతున్నాడట. ఇప్పటికే తారక్ లుక్ ఏ విధంగా ఉంటుందో ఒక వీడియో బయటకు వచ్చింది. లీక్ అవ్వడంతో ఆ సీన్స్ ని మళ్ళీ మారుస్థున్నాడు. ఇప్పుడు రామ్ చరణ్ లుక్ విషయంలో కూడా అదే రేంజ్ లో జాగ్రత్తలు తీసుకుని విడుదల చేసే విధంగా ప్లాన్ చేస్తున్నాడు దర్శకుడు.

Read more RELATED
Recommended to you

Latest news