రాజకీయ రంగం నుంచి సినిమా రంగంలోకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి వరుసగా రెండు బ్లాక్ బస్టర్ విజయాలు సాధించారు. గత ఏడాది అక్టోబర్ 2వ తారీఖున గాంధీ జయంతి సందర్భంగా తన కెరీర్ లోనే భారీ బడ్జెట్ సినిమా అయినా ‘సైరా’ సినిమాతో టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర చిరంజీవి నాన్ బాహుబలి రికార్డులు క్రియేట్ చేయడం జరిగింది. కాగా ప్రస్తుతం కొరటాల శివతో సినిమా చేస్తున్నారు. ఇదే సమయంలో లూసీఫర్ సినిమాని రీమేక్ చేయడానికి చిరంజీవి కసరత్తు చేస్తున్నారు.
ఇదిలావుండగా తన చిన్న కూతురు శ్రీజ భర్త అల్లుడు కళ్యాణ్ దేవ్ సినిమా కోసం చిరంజీవి తీవ్రంగా కష్ట పడుతూ ఉండటం ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్ద హాట్ టాపిక్ అయింది. విషయంలోకి వెళితే కళ్యాణ్ దేవ్ ‘విజేత’ సినిమా తో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వడం జరిగింది. తన మామ చిరంజీవి టైటిల్ తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి హిట్ కొడదామని భావించిన మొదటి సినిమా పెద్దగా అలరించలేకపోయింది.
దీంతో ప్రస్తుతం ‘సూపర్ మచ్చి’ అనే సినిమాతో రెండోసారి ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయ్యారు కళ్యాణ్ దేవ్. ఇటువంటి నేపథ్యంలో తన చిన్న అల్లుడు సినిమా యొక్క స్క్రీన్ ప్లే, డైలాగ్స్ నుంచి పోస్ట్ ప్రొడక్షన్ వరకు ప్రతి పనిని తనే దగ్గరుండి చిరంజీవి చూడటాన్ని చూసి చాలా మంది ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు కొడుకు రామ్ చరణ్ మరియు తమ్ముడు పవన్ కళ్యాణ్ కోసం కూడా ఎప్పుడు ఈ విధంగా చిరంజీవి కష్టపడి ఉండరు అని కామెంట్ చేస్తున్నారు. కాగా మరో పక్క చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ కి సినిమాలంటే బాగా ఇంట్రెస్ట్ కావడంతోనే చిరంజీవి ఈ విధంగా అల్లుడు సక్సెస్ కోసం కష్టపడుతున్నట్లు మెగా కాంపౌండ్ లో టాక్.