రాజమౌళి – ఉదయ్ కిరణ్ కాంబినేషన్ లో రావాల్సిన సినిమా ఆగిపోవడానికి కారణం..?

ప్రస్తుతం దేశ సినీ ఇండస్ట్రీ గర్వించదగ్గ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు రాజమౌళి . బాహుబలి సినిమా తో ఈయన క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. బాలీవుడ్ హీరోలు కూడా రాజమౌళి తో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. కానీ రాజమౌళి మాత్రం కేవలం తెలుగు హీరోలతోనే సినిమాలు చేయాలి అని.. వారిని పాన్ ఇండియా స్టార్ లుగా మార్చాలని ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన సినిమాలలో ఎక్కువగా తెలుగు హీరోలనే ఎంచుకుంటూ ఉండడం గమనార్హం. ఇదిలా ఉండగా గతంలో హీరోలు రాజమౌళి దర్శకత్వంలో ఆఫర్లు వచ్చినా నటించేవారు కాదు.Director SS Rajamouli: 'సై' సినిమాకు ఫస్ట్ హీరో నితిన్ కాదా..? రాజమౌళి ఆఫర్ ను రిజెక్ట్ చేసిన ఉదయ్ కిరణ్!

అలాంటి వారిలో యంగ్ హీరో ఉదయ్ కిరణ్ కూడా ఒకరు. రాజమౌళికి పెద్దగా క్రేజ్ లేని సమయంలో నితిన్ హీరోగా సై సినిమా వచ్చిన విషయం తెలిసిందే . కాలేజీ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది . అంతేకాదు ఈ సినిమాకి యూత్ కూడా బాగా కనెక్ట్ అయ్యారు. అయితే ఈ సినిమా కథ ముందుగా రాజమౌళి ఉదయ్ కిరణ్ కి వినిపించాడు. అప్పటికే ఉదయ్ కిరణ్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇక అప్పుడప్పుడే స్టార్ హీరోగా ఎదుగుతున్న ఉదయ్ కిరణ్ డేట్స్ ఖాళీ లేకపోవడంతో రాజమౌళి ఆఫర్ ను తిరస్కరించాడు.

రాజమౌళి నితిన్ కి కథ వినిపించి.. నితిన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో జెనీలియా కూడా నటించి మంచి ఇమేజ్ ను సొంతం చేసుకుంది. యూత్ ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ గా వచ్చిన ఈ సినిమాకి ఇప్పటికీ కూడా అభిమానులు ఆకర్షితులవుతారు అనడంలో సందేహం లేదు. ఇక పోతే ఈ సినిమాను మిస్ చేసుకున్న తర్వాత ఉదయ్ కిరణ్ చాలా బాధ పడ్డారు అని కూడా సమాచారం. అయితే ఇండస్ట్రీలో ఇలాంటివి జరగడం సర్వసాధారణమని చెప్పవచ్చు.