టాలీవుడ్ ఇండస్ట్రీలో అపజెయాలు ఎరుగని డైరెక్టర్ ఎవరంటే ప్రతి ఒక్కరికి రాజమౌళి పేరు గుర్తుకువస్తుంది.. రాజమౌళి కెరియర్లో ఇప్పటివరకు ఒక్క ఫ్లాప్ కూడా చవి చూడలేదు.. మొదట సీరియల్ కు దర్శకత్వం వహిస్తూ పనిచేసిన రాజమౌళి ఎన్టీఆర్ నటించిన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా ద్వారా దర్శకుడుగా మారారు. అయితే మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న రాజమౌళి ఆ తరువాత వరుస సినిమాలకు దర్శకత్వం వహించి స్టార్ డైరెక్టర్గా పేరు సంపాదించారు.
రాజమౌళి తెలుగు సినీ ఇండస్ట్రీని ప్రపంచవ్యాప్తంగా RRR చిత్రంతో గర్వించబడేలా చేశారని చెప్పవచ్చు. పాన్ ఇండియా స్థాయిలో బాహుబలి సిరీస్ లతో మంచి విజయాలను అందుకున్నారు రాజమౌళి. ప్రస్తుతం మహేష్ బాబుతో కలిసి ఒక సినిమా చేయబోతున్నామంటూ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. రాజమౌళి వ్యక్తిగత విషయంలోకి వెళితే రాజమౌళి రమా అనే మహిళను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.. ఇది రాజమౌళికి మొదటి వివాహం అయినప్పటికీ ఆమెకు మాత్రం రెండో వివాహం.
రమాకు ఇదివరకే పెళ్లి చేసుకొని కార్తికేయ అనే కుమారుడు జన్మించారు.. ఆ తర్వాత భర్తతో విభేదాలు రావడంతో విడిపోవడం జరిగింది.అలా కొడుకుతో ఒంటరిగా జీవిస్తున్న ఈమెను రాజమౌళి వివాహం చేసుకున్నారు.. అయితే ఇప్పటివరకు వీరికి పిల్లలు లేరు.. మాయక అనే ఒక చిన్నారిని దత్తకు తీసుకొని పెంచుకోవడం జరిగింది. ఇదంతా ఇలా ఉంటే తాజాగా రాజమౌళి గురించి ఒక విషయం వైరల్ గా మారుతోంది..మరొకసారి రాజమౌళి తండ్రి కాబోతున్నారని వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.. అయితే ఈ విషయం తెలిసిన పలువురు నెటిజెన్స్ తాత కావలసిన వయసులో రాజమౌళి తండ్రి కావడం ఏంటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు..
అసలు విషయంలోకి వెళ్తే రాజమౌళి అనాధ పిల్లలకు ఎంత అండగా నిలుస్తూ ఉన్నారో అందరికీ తెలిసింది..ఇప్పుడు తాజాగా మరొక అనాధ ఆడపిల్లను దత్తకు తీసుకున్నట్లు తెలుస్తోంది. వారి బాగోగులను తనే చూసుకోబోతున్నట్లు సమాచారం.. దీంతో ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.