ఒక సంవత్సరంలో 21 శాతం పెరిగిన బీజేపీ ఆస్తులు … !

-

ప్రతి సంవత్సరం కూడా దేశంలో ఉన్న ముఖ్యమైన రాజకీయ పార్టీల ఆస్తుల గురించిన పూర్తి వివరాలను ADR ఒక నివేదికను ప్రకటిస్తూ ఉంటుంది. అదే విధంగా ఈ సంవత్సరం కూడా భారతీయ రాజకీయ పార్టీల ఆస్తులను ప్రకటించింది. ఇందులో ప్రస్తుతం అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఆస్తులను రూ. 6046 .81 కోట్లు గా ప్రకటించింది. ఆ తర్వాత కాంగ్రెస్ కు రూ. 805 .68 కోట్లు ఆస్తులు ఉన్నాయంటూ తెలిపింది. ఇక BSP కి రూ. 690 .71 కోట్లు మరియు తృణమూల్ కాంగ్రెస్ కు రూ. 458 .10 కోట్లు ఉన్నట్లు నివేదిక పేర్కొంది. ఈ ఆస్తుల వివరాలను పట్టి చూస్తే బీజేపీకి అత్యధికంగా ఆస్తులు ఉన్నాయని స్పష్టంగా అర్ధమవుతోంది. ఇక గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం బీజేపీ ఆస్తులు 20 శాతం పెరిగాయి. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ ఆస్తులు గత సంవత్సరంతో పోలిస్తే 16 .6 శాతం పెరిగాయి.

ఇక దేశంలోని మొత్తం రాజకీయ పార్టీల ఆస్తుల విలువను చూస్తే రూ. 8829 కోట్లు ఉన్నాయి. మరి ఈ ఆస్తుల పెరుగుదల గురించి బీజేపీని విపక్షాలు ప్రశ్నించే అవకాశం ఉందా లేదా అన్నది చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news