ఆసియా కప్ 2023: నేపాల్ ను స్వేచ్ఛగా ఆడించిన టీం ఇండియా !

-

రోహిత్ శర్మ సారధ్యంలోని టీం ఇండియా ఆసియా కప్ ను సాధించడానికి ఎంతో కసిగా బరిలోకి దిగింది. టాస్ గెలిచిన ఇండియా మొదట ఫీల్డింగ్ ఎంచుకోవడంతో మొదట బ్యాటింగ్ చేసిన నేపాల్ జట్టు 48 .2 ఓవర్ లలో 230 పరుగులు చేసి అల్ అవుట్ అయింది. నేపాల్ టీం కు ఇండియా టీం కు ప్రదర్శనలో మరియు మ్యాచ్ ఫలితం లో చాలా తేడాను అభిమానులు ఆశిస్తారు. కానీ నేపాల్ జట్టు మాత్రం చాలా అనుభవం ఉన్నట్లు తన ప్రదర్శనతో ఎంతోమంది ప్రసంశలు పొందింది అని చెప్పాలి. ముఖ్యంగా ఒక దశలో నేపాల్ జట్టు 144 పరుగులకు 6 కీలక వికెట్లు కోల్పోయింది. ఇక మిగిలిన నాలుగు వికెట్లు మరో 20 నుండి 30 పరుగులు చేస్తే గొప్ప అనుకున్నారు క్రికెట్ విశ్లేషకులు.. కానీ నేపాల్ జట్టు ఎంతో జాగ్రత్తగా ఒక్కో పరుగు జోడిస్తూ ఇండియా బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ ఆడింది.

చివరికి మిగిలిన నాలుగు వికెట్లు కలిపి చేసిన పరుగులు 86. ఎంతో అనుభవం ఉన్న సిరాజ్, షమీ, శార్దూల్ , కుల్దీప్ యాదవ్ లు చివరి నాలుగు వికెట్లు పడగొట్టలేక పూర్తిగా నేపాల్ ను స్వేచ్ఛగా ఆడించారు.

Read more RELATED
Recommended to you

Latest news