చెల్లెలితో విభేదాలపై రాజమౌళి క్లారిటీ.. ఇన్నేళ్ళు పట్టిందా..?

-

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోనే కాదు యావత్తు ప్రపంచంలో సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు రాజమౌళి.. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈయన ఇప్పుడు ఆర్ఆర్ఆర్ చిత్రంతో హాలీవుడ్ దృష్టిని కూడా ఆకర్షించాడు. ప్రముఖ హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ కూడా రాజమౌళిని ప్రశంసించారు అంటే ఆయన రేంజ్ ఏ పాటి తో అర్థం చేసుకోవచ్చు ముఖ్యంగా అంతర్జాతీయ వేదికపై ఎన్నో అవార్డ్స్, రివార్డ్స్ కూడా ఆర్ ఆర్ ఆర్ సినిమాతో సొంతం చేసుకున్నారు. ఈ సినిమాకి రాజమౌళి అన్నయ్య ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. జక్కన్న కుటుంబంలోని వారందరూ ప్రస్తుతం ఇండస్ట్రీలో కొనసాగుతున్న వారే…

రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ స్క్రిప్ట్స్ రాస్తుండగా.. అన్నయ్య కీరవాణి సంగీతం అందిస్తున్నారు.. ఆయన భార్య రమా సినిమాలకు కాస్టింగ్ డిజైనర్గా వర్క్ చేస్తుంటారు. వీరే కాకుండా ఆయన వదిన కొడుకులు కూడా తన సినిమాల కోసమే పని చేస్తున్నారు. ఇప్పుడు వీరితోపాటు ఆయనకు ఒక చెల్లి కూడా ఉందనే విషయం చాలా తక్కువ మందికి తెలుసు.. ఆమె ఎవరో కాదు శ్రీలేఖ.. తెలుగు సినీ పరిశ్రమలో మొట్టమొదటి లేడీ మ్యూజిక్ డైరెక్టర్ , గాయనిగా గుర్తింపు తెచ్చుకున్న శ్రీలేఖ ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు సంగీతం అందించారు. గత కొన్ని ఏళ్లుగా చెల్లి శ్రీలేఖకు రాజమౌళికి మధ్య విభేదాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది..

అందుకే ఆమెకు ఆయన సినిమాలలో చిన్న అవకాశం కూడా ఇవ్వరంటూ సమాచారం.. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రాజమౌళి తన చెల్లెలితో ఎలాంటి విభేదాలు లేవు అని క్లారిటీ ఇచ్చారు. సంగీత దర్శకురాలిగా ఎంఎం శ్రీలేఖ సినీ కెరియర్ లో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 25 దేశాలలో వరల్డ్ మ్యూజిక్ టూర్ చేయబోతున్నారు..ఏడాది మార్చి 17 నుంచి ఈ పర్యటనను ప్రారంభిస్తున్న నేపథ్యంలో ఇందుకు సంబంధించిన పోస్టర్ను ఆమె సోదరుడు రాజమౌళి ఆవిష్కరించారు. అయితే ఆయన సినిమాలతో బిజీగా ఉండడం వల్ల విభేదాల పై క్లారిటీ ఇవ్వడానికి ఇన్నేళ్లు పట్టిందని సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news