ఫ్యాన్స్ కి షాకిచ్చిన రజనీకాంత్…!

-

కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా మాస్ చిత్రాల దర్శకుడు శివ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘అన్నాత్తే’. తెలుగులో అన్నయ్య పేరుతో రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాలో రజనీ కాంత్ సరసన ఖుష్బూ, మీనా, నయనతార, కీర్తి సురేశ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి కొంత టాకీ పార్ట్ ని కంప్లీట్ చేశారు చిత్ర యూనిట్. అయితే కరోనా వ్యాప్తితో లాక్ డౌన్ విధించడం వల్ల ‘అన్నాత్తే’ సినిమా షూటింగ్ ని నిలిపివేశారు.

 

ఇక ఈ సినిమాకి కొబ్బరికాయ కొట్టిన రోజు 2021 సంక్రాంతికి విడుదల చేస్తామని చిత్ర నిర్మాతలు ప్రకటించారు. అందుకు తగ్గట్టుగానే షూటింగ్ షెడ్యూల్స్ ని ప్లాన్ చేశారు. శరవేగంగా చిత్రీకరణని జరిపారు. కానీ లాక్ డౌన్ ఎఫెక్ట్ తో ఇప్పట్లో షూటింగ్ నిర్వహించలేకపోవడం తో ఈ సినిమా వేసవి రిలీజ్ సంక్రాంతి నుండి సమ్మర్ కి వెళ్ళిపోయింది. దీంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ లో కొంత నిరుత్సాహం నెలకొంది.

ఇక ఈ సినిమాని భారీ బడ్జెట్ తో తెలుగు తమిళంలో రిలీజ్ చేస్తుండగా వరసగా ఫ్లాప్స్ తో సతమతమవుతున్న రజనీకాంత్ ‘అన్నాత్తే’ మీద భారీ గా అంచానాలు పెట్టుకున్నారు. అంతేకాదు ఆయన అభిమానులు ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందన్న ధీమాతో ఉన్నారు. అందుకు కారణం దర్శకుడు శివ సక్సస్ ట్రాక్. వరసగా అజిత్ కి బ్లాక్ బస్టర్స్ ఇచ్చాడు. అది చూసే రజనీకాంత్ ‘అన్నాత్తే’ కి ఛాన్స్ ఇచ్చాడు. మరి ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ని ఇస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news