కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం భారీ సహాయం.. !

-

భరతమాత తన ముద్దుబిడ్దలను కోల్పోయానని కన్నీరు పెడుతుంది.. యావత్ భారతదేశ ప్రజల గుండెల్లో కూడా తమ జవాన్‌లు వీరమరణం పొందారనే వేదన సృష్టంగా కనిపిస్తుంది.. పిచ్చికుక్కల వలే చైనా మూకలు చేసిన దాడిలో అసువులు బాసిన సైనికుల కుటుంబాల ఋణం తీర్చుకోలేనిది.. వారి త్యాగం మరవలేనిది.. ఇలాంటి నేపధ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చైనా సైనికులతో గాల్వన్ లోయలో జరిగిన ఘర్షణల్లో మరణించిన కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి పూర్తి అండగా నిలుస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు.

ఈ క్రమంలో సంతోష్ బాబు కుటుంబానికి 5 కోట్ల రూపాయల నగదుతో పాటుగా, నివాస స్థలం, ఆయన భార్యకు గ్రూప్-1 స్థాయి ఉద్యోగం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అంతే కాకుండా ఇదే ఘర్షణలో మరణించిన మిగతా 19 మంది సైనిక కుటుంబ సభ్యులకు కూడా ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం తరుఫున కేంద్ర రక్షణ మంత్రి ద్వారా అందిస్తామని ఈ సందర్భంగా కేసీఆర్‌ పేర్కొన్నారు..

 

ఇక మనకోసం, మన దేశం కోసం అహర్నిశలు శ్రమిస్తున్న జవాన్‌ల ఋణం ఎప్పటికి తీర్చుకోలేనిది.. ఇంతటి వీరులను అందించిన వారితల్లిదండ్రుల ఋణం కూడా తీరనిది.. మరణాన్ని ఎప్పుడు తమ భుజాల మీద మోస్తూనే చిరనువ్వును పెదాలపై తొలగనీయకుండా ఎక్కడో చలిలో దేశప్రజల కోసం విధులు నిర్వహిస్తున్న సైనికులు మన భారతీయుల గుండె చప్పుళ్లు.. ఇలాంటి వారి కుటుంబాలను ఆదుకోవడం మన ప్రభుత్వాల బాధ్యత.. ఎందుకంటే వీర మరణం పొందిన సైనికుల కుటుంబాలను ఆదుకోవడం ద్వారా సైనికుల్లో ఆత్మ విశ్వాసం, వారి కుటుంబానికి భరోసా లభిస్తుంది..

Read more RELATED
Recommended to you

Latest news