మారుతి బర్త్ డే ట్రీట్.. ‘రాజాసాబ్’ మేకింగ్ వీడియో రిలీజ్

-

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ‘ది రాజా సాబ్’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఈ చిత్రానికి మారుతి దర్శకత్వం వహిస్తున్నాడు. హార్రర్ కామెడీ ఎంటర్ టైనర్ గా ఈ మూవీ రాబోతుంది. ఈ మూవీలో ప్రభాస్ వింటేజ్ డార్లింగ్ లుక్స్ లో కనిపిస్తుండటంతో ప్రేక్షకులు ఈ చిత్రం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇవాళ దర్శకుడు మారుతి పుట్టిన రోజు సందర్భంగా ‘ది రాజా సాబ్’ మూవీకి సంబంధించి ఓ స్పెషల్ వీడియో ద్వారా ఆయనకు విషెష్ తెలిపారు. మేకింగ్ వీడియో కూడా విడుదల చేశారు మేకర్స్. ఇందులో దర్శకుడు మారుతి ఈ సినిమా కోసం ఎంత కష్టపడ్డాడో చూపించారు. ఈ వీడియోతో అభిమానులు కాస్త సర్ ప్రైజ్ అయ్యారనే చెప్పాలి. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇందులో అందాల భామలు మాళవిక మోమనన్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news