హర్యానా విజయం భారత ప్రజాస్వామ్య విజయం : ప్రధాని మోడీ

-

హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో విజయం భారత ప్రజాస్వామ్య విజయం అని  ప్రధాని మోడీ పేర్కొన్నారు. హర్యానాలో హ్యాట్రిక్ విజయం తరువాత ఢిల్లీ బీజేపీ హెడ్ క్వార్టర్స్ లో విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. హర్యానా రైతులు తాము బీజేపీ వైపే ఉన్నామని నిరూపించుకున్నారు. హర్యానాలో కమలం మూడో సారి వికసించింది.

జమ్మూ కాశ్మీర్ ఎన్సీ-కాంగ్రెస్ కూటమికి అధిక సీట్లు వచ్చాయి. బీజేపీకి మాత్రం గతం కంటే అధికంగా ఓట్లు లభించాయి. హర్యానాలో ప్రతీ పదేళ్లకొకసారి ప్రభుత్వం మారుతుంది. కానీ ఈసారి బీజేపీ రికార్డు సృష్టించింది. గిరిజన, ఆదివాసీలను కాంగ్రెస్ ఎప్పుడూ ప్రధాని చేయదు. హర్యానా విజయంలో పార్టీ కార్యకర్తలదే కీలక పాత్ర అన్నారు. పలు వర్గాల ప్రజలను కాంగ్రెస్ రెచ్చగొట్టిందని తెలిపారు. హర్యానాలో ఇప్పటివరకు 13సార్లు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఏ పార్టీ కూడా వరుసగా మూడుసార్లు గెలిచిన దాఖలాలు లేవని తెలిపారు. నవరాత్రి ఉత్సవాల సమయంలో హర్యానాలో మూడో సారి విజయం సాధించడం శుభసూచకం అన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. 

Read more RELATED
Recommended to you

Latest news