యాంగ్రీ యంగ్ మన్ డాక్టర్ రాజశేఖర్ కులుమనాలి దగ్గర యాక్సిడెంట్ కు గురయ్యారని ఆయన పరిస్థితి విషయంగా ఉందని పలు కథనాలు వచ్చాయి. అయితే ఇదిఇలానే కొనసాగితే కష్టమని భావించిన రాజశేఖర్ అఫిషియల్ ప్రకటన చేశారు. పది రోజుల క్రితం కల్కి షూటింగ్ లో గాయపడిన మాట వాస్తవమే అని.. కాకపోతే అందరి డేట్స్ సెట్ చేయడం వల్ల తాను అలానే షూట్ చేయాల్సి వచ్చిందని అన్నారు.
కులుమనాలి వెళ్లే రోడ్డులో కొండ చరియలు విరిగి పడగా తృటిలో ప్రమాదం తప్పిందని.. ప్రస్తుతం మేమంతా సేఫ్ గా ఉన్నామని. అందమైన కులుమనాలి లొకేషన్స్ లో కల్కి సినిమా షూటింగ్ జరుపుకుంటుందని అని వివరణ ఇచ్చారు. అయితే మీడియాలో వచ్చిన వార్తల వల్ల అభిమానులు, బంధువులు కొంత ఆందోళన చెందారని. ఇక తన గురించి ఎవరు రూమర్స్ స్ప్రెడ్ చేయొద్దని మీడియాను కోరారు రాజశేఖర్.