బన్ని.. త్రిష.. ’96’ రీమేక్

-

ఈమధ్యనే తమిళంలో రిలీజై సూపర్ హిట్ కొట్టిన సినిమా 96. ప్రేమ్ కుమార్ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో కోలీవుడ్ క్రేజీ హీరో విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించడం జరిగింది. 96 అంటూ ఓ ఎమోషనల్ యూత్ ఫుల్ డ్రామాతో ఈ సినిమా తెరకెక్కింది. తమిళ ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టగా ఈ మూవీని తెలుగులో దిల్ రాజు రీమేక్ చేస్తున్నారు. అక్కడ సూపర్ హిట్ బొమ్మే కాని కథ, కథనాలు తెలుగు సినిమాల ఫార్మెట్ కు చాలా దూరంగా ఉంటాయి.

ఈ సినిమా రీమేక్ కన్నా డబ్ చేసి రిలీజ్ చేయడం బెటర్ అని దిల్ రాజుకి సలహాలు ఇస్తున్నారు. అయినా సరే దిల్ రాజు మాత్రం సినిమా రీమేక్ చేయాల్సిందే అని పట్టుబడుతున్నాడట. మాత్రుక దర్శకుడు ప్రేమ్ కుమార్ తెలుగు సినిమాను డైరెక్ట్ చేస్తాడట. ఇక ఈ సినిమాలో నాని, సమంత కలిసి నటిస్తారని వార్తలు రాగా ఇప్పుడు బన్ని, త్రిష జోడీ కడతారని తెలుస్తుంది. 96 తమిళ వర్షన్ లో త్రిష నటన అందరిని ఆకట్టుకుంది.

బన్ని.. త్రిషా కలిసి చేసే ఈ ప్రయత్నం ఎలా ఉండబోతుందో చూడాలి. మాస్ హీరోగా స్టార్ ఇమేజ్ ఉన్న అల్లు అర్జున్ 96 లాంటి కథ చేస్తే కచ్చితంగా కొత్తగా ఉంటుంది. మరి హీరో ఇమేజ్ ను దృష్టిలో ఉంచుకుని కథలో ఏదైనా మార్పులు చేస్తారేమో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news