RajaVikramarka : క్రైమ్ థ్రిల్లర్ గా టీజర్

-

ఆర్ ఎక్స్ 100 ద్వారా ఇండ‌స్ట్రీకి ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో కార్తికేయ‌. ఈయ‌న చేసిన సినిమాలు అన్నీ మంచి గుర్తింపు తెచ్చుకున్నా.. కొన్ని ప్లాపులు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు కెరీర్‌లో ఏడో సినిమా చేస్తున్నాడు హీరో కార్తికేయ‌. ఆయ‌న రీసెంట్‌గా న‌టించిన చావుక‌బురు చ‌ల్ల‌గా ఎన్నో అంచ‌నాల న‌డుమ వ‌చ్చి ప్లాప్ టాక్ తెచ్చుకుంది.

దీంతో ఇక‌పై చేసే సినిమాల్లో చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నాడు ఈ యంగ్ హీరో. ఇందుకోసం శ్రీ చిత్ర మూవీ మేకర్స్ బ్యాన‌ర్ మీద వి.వి. వినాయక్ శిష్యుడు అయిన‌ శ్రీ సరిపల్లి డైరెక్ష‌న్‌లో ఓ మూవీ చేస్తున్నాడు. అదే రాజావిక్ర‌మార్క‌. ఈ మూవీలో కార్తికేయ స‌రికొత్త లుక్‌లో క‌నిపిస్తున్నాడు. గ‌తంలో చేయ‌ని రోల్‌లో మెస్మ‌రైజ్ చేయ‌బోతున్నాడు.

అయితే తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ ను విడుదల చేసింది చిత్ర బృందం. చాలా డిఫరెంట్ గా సాగిన ఈ టీజర్ లో కార్తికేయ ఎక్కువగా గన్స్ తో కనిపించగా.. ఆపై కాస్త కామిడీ ని జోడించారు. ఇక ఈ టీజర్ చూస్తే.. హీరో కార్తికేయ‌.. ఈ సినిమాలో ఎన్ ఐ ఏ ఆఫీసర్ గా నటిస్తున్నట్లు అర్థమవుతోంది. ఇక ఈ తాజాగా అప్డేట్ తో సినిమా పై క్రేజ్ మరింత పెరిగింది.

 

Read more RELATED
Recommended to you

Latest news