బాలీవుడ్ నటి మలైకా అరోరా గురించి ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రత్యేక పాటల్లో ఎక్కువగా కనిపించే మలైకా అరోరా, గత కొన్ని రోజులుగా వార్తల్లో ఉంటూ రావడానికి కారణం, అర్జున్ కపూర్ తో ప్రేమ వ్యవహారమే. తన కంటే వయసులో చిన్నవాడైన అర్జున్ కపూర్ తో మలైకా ప్రేమ వ్యవహారం అందరికీ తెలిసిన విషయమే. వీరిద్దరూ పెళ్ళి చేసుకుంటారని వార్తలు కూడా వచ్చాయి. కానీ, ఈ విషయంలో ఇంకా ముందుకు వెళ్ళడం లేదు.
ఇదిలా ఉంటే ఫిట్ నెస్ మీద అధిక శ్రద్ధ వహించే మలైకా అరోరా, సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు. అందమైన ఫోజులతో ఫోటోలకు ఫోజులిస్తూ అభిమానులతో టచ్ లో ఉంటున్నారు. తాజాగా మలైకా షేర్ చేసిన ఫోటోలు కుర్రకారును వెర్రెత్తిస్తున్నాయి. ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఈ ఫోటోలు వైరల్ అయ్యాయి. సాగరకన్య లాంటి ఔట్ ఫిట్ లో హొయలు పోతున్న మలైకా అరోరా, కుర్రకారు మతి పోగొడుతుంది.
మత్తెక్కించే కళ్ళు అభిమానుల గుండెల్లో తూట్లు పొడుస్తున్నట్టుగా ఉన్నాయి. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. వయసు పెరుగుతున్న కొద్దీ అందం పెరుగుతున్నట్టుగా, యవ్వనం మళ్ళీ వచ్చినట్టుగా ఉన్నారు. మొత్తానికి సాగరకన్య ఫోజులతో సోషల్ మీడియాలో వేడి పుట్టించారు.