రజిని 2.ఓ రివ్యూ & రేటింగ్

-

శంకర్, రజినికాంత్ కాంబో మూవీ అంటేనే భారీ అంచనాలు ఉంటాయి. ఇక ఆ సినిమా రోబో లాంటి ఓ సూపర్ హిట్ సినిమాకు సీక్వల్ అయితే ఎలా ఉంటుంది. 2.ఓగా రోబో సీక్వల్ తీసిన శంకర్ సినిమా టీజర్, ట్రైలర్ తో భారీ అంచనాలు ఏర్పరిచాడు. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దాం.

కథ :

మానవజాతి మొత్తం సెల్ ఫోన్స్ తో బిజీగా మారింది. ఫోన్ ఫ్రీక్వెన్సీ ఎలా ఉంది వాటి వల్ల ఎవరికి ఎలాంటి అరిష్టం కలుగుతుంది ఇవేమి ఆలోచించడం లేదు. ఈ క్రమంలో పక్షి రాజైన అక్షయ్ కుమార్ చిన్ననాటి నుండి పక్షులతో ప్రేమగా ఉంటాడు. పక్షులను పెంచుతూ వాటి బాగోగులు చూసుకుంటాడు. అయితే సెల్ ఫోన్ రేడియేషన్ వల్ల రాను రాను పక్షులు చనిపోతుంటాయి. ఈ విషయం పట్ల ప్రభుత్వాన్ని అడిగినా పెద్దగా రెస్పాన్స్ ఉండదు. అందుకే పక్షులన్ని చనిపోవడం జీర్ణించుకోలేని పక్షి రాజు సెల్ టవర్ కు ఉరి వేసుకుని చనిపోతాడు. ఇందుకు కారణమైన మనుషుల మీద పగ పెంచుకుంటాడు. హఠాత్తుగా అందరి సెల్ ఫోన్స్ మాయవడం జరుగుతుంది. దీనికి కారణం తెలుసుకునేందుకు సైంటిస్ట్ వసీకర్ (రజినికాంత్) తన ఫోన్ ద్వారా అసలేం జరుగుతుదని కనిపెడతాడు. పక్షి రాజుని కేవలం చిట్టి ద్వారానే అంతమొందించగలం అని ప్రభుత్వానికి చెబుతాడు. మొదట ప్రభుత్వం దానికి ఒప్పుకోకున్నా పక్షిరాజు చేస్తున్న ప్రాణ నష్టాన్ని చూసి చిట్టిని రంగంలో దించుతారు. చిట్టి వర్సెస్ పక్షి రాజు యుద్ధం మొదలవుతుంది. ఫైనల్ గా చిట్టి రోబో పక్షి రాజుని ఎలా సం హరించాడు అన్నది సినిమా కథ.

ఎలా ఉందంటే :

సెల్ ఫోన్స్ ఫీక్వెన్సీ వల్ల పక్షులు చనిపోవడం అని శంకర్ రాసుకున్న కాన్సెప్ట్ అద్భుతమని చెప్పొచ్చు. ముఖ్యంగా సెల్ పోయిన తర్వాత ప్రజలు తమ కష్టాలు చెఒప్పుకోవడం చూస్తే సెల్ ఫోన్ వారి జీవితంలో ఎంత భాగమైందో అర్ధమవుతుంది. ఇక ఎంచుకున్న కథ బాగున్నా దాన్ని నడిపించిన విధానంలో తప్పటడుగులు పడినట్టు అనిపిస్తుంది.

కథనంలో కేవలం పక్షి రాజుని అంతమొందించడం ఒక్కటే టార్గెట్. అందుకే వసీకర్ ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో అక్కడక్కడ కాస్త ల్యాగ్ అయినట్టు అనిపిస్తుంది. వావ్ ఫ్యాక్టర్స్ ఉన్నా అక్కడక్కడ ఎందుకో అటు ఇటుగా ఉంటుంది. సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ మాత్రం న భూతో న భవిష్యత్ అనేలా ఉన్నాయి.

సినిమాకు ప్రాణం పోసింది గ్రాఫిక్స్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా పక్షి రాజుగా అక్షయ్ కు వాడిన విజువల్ ఎఫెక్ట్స్ బాగున్నాయి. ఇంటర్వల్, క్లైమాక్స్ సీన్స్ బాగున్నాయి. రోబో సర్ ప్రైజ్ గా అనిపించడం వల్ల ఈ సీక్వల్ మీద ఇంకా ఏదో ఉంటుందని అంచనాలు పెంచుకున్నారు. ఆ అంచనాలను సినిమా అందుకునందని చెప్పొచ్చు.

ఎలా చేశారు :

సూపర్ స్టార్ రజిని సూపర్ ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్ ఫ్యాన్స్ కు నచ్చుతుంది. స్టైల్, యాక్షన్ లో రజిని మరోసారి సత్తా చాటారు. క్లైమాక్స్ లో బుల్లి రోబో వర్షన్ 3.ఓగా అదరగొట్టాడు. సినిమాలో ప్రతినాయకుడిగా అక్షయ్ కుమార్ అద్భుత నటన కనబరిచారు. సినిమా కోసం రజిని ఎంత కష్టపడ్డారో అక్షయ్ కూడా అంత కష్టపడ్డారని తెలుస్తుంది. ఎమీ జాక్సన్ రోబోగా నటించింది. ఆమె సోసోగానే అనిపిస్తుంది. ఇక మిగతా పాత్రలన్ని పరిధి మేరకు నటించి మెప్పించారు.

నిరవ్ షా సినిమటోగ్రఫీ ప్లస్ అయ్యింది. రెహమాన్ మ్యూజిక్ మరో లెవల్ కు తీసుకెళ్లింది. కథ, కథనాలతో పాటుగా విజువల్ వండర్ గా 2.ఓని శంకర్ తీర్చిదిద్దిన తీరు బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ బడ్జెట్ ప్రతి రూపాయి తెర మీద కనిపిస్తుంది.

ప్లస్ పాయింట్స్ :

రజినికాంత్

అక్షయ్ కుమార్

సినిమాటోగ్రఫీ

విఎఫెక్స్ ఎఫెక్ట్స్

మైనస్ పాయింట్స్ :

అక్కడక్కడ స్లో అవడం

రొమాన్స్ లేకపోవడం

బాటం లైన్ : 

రోబో సీక్వల్ విజువల్ వండర్..!

రేటింగ్ : 3.5/5

Read more RELATED
Recommended to you

Latest news