ఆదిలాబాద్‌ :నన్ను అప్పుడు నమ్మలేదు…కేసీఆర్

-

నాడు తెలంగాణ సాధించుకున్న తర్వాత ఎన్నికల ప్రచారంలో భాగంగా నేను 24 గంటల పాటు కరెంట్ ఇస్తానంటే నన్ను ఎవ్వరు నమ్మలేదు.. ఇప్పుడు అదే ప్రజల్లో నమ్మకం పెరిగింది. ఎలాంటి కోత లేని 24 గంటల నాణ్యమైన కరెంటుని నేడు అందరు పొందుతున్నారని వెల్లడించారు. ఆదిలాబాద్‌లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొని మాట్లాడుతూ..ఈ నాలుగున్నరేళ్లలో ప్రణాళికలకే ఎక్కువ సమయం సరిపోయింది. తప్పులు చేయకూడదు అనే ఉద్దేశంతోనే ప్రతీ విషయాన్ని క్షుణ్ణంగ పరిశీలించి నిర్ణయం తీసుకుంటున్నామన్నారు. తెరాస పాలనను మెచ్చిన ప్రజలు మరోసారి దయతో తెరాసను అధికారంలోకి తీసుకొచ్చేందుకు సిద్దమవుతున్నారని తెలిపారు. మీ జోగురామన్న గెలుస్తాడు. ఎన్నికల తర్వాత ఆదిలాబాద్‌ వచ్చి మూడు రోజులు ఇక్కడే ఉంటా. ప్రతి ఎన్నికల్లో లోయర్‌ పెన్‌గంగ పేరుతో ఓట్లు దండుకుంటున్నారు. వారు ఏమీ చేయరు.

తెరాస అధికారంలోకి వచ్చాక మహారాష్ట్ర ముఖ్యమంత్రిని ఒప్పించి బ్యారేజీ కడుతున్నాం. సాత్నాల వాగుపై చెక్‌డ్యాం నిర్మిస్తాం. సాత్నాల, సోమాల మండలాలను ప్రభుత్వం వచ్చిన వెంటనే ఏర్పాటు చేస్తాం. రాష్ట్రాలను మున్సిపాల్టీలుగా మారుస్తున్నారు. 50 శాతం కంటే ఎక్కువ రిజర్వేషన్‌ ఉండొద్దని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిందేగానీ రాజ్యాగంలో ఆ విషయం ఎక్కడా లేదు’’ అని కేసీఆర్ వివరించారు. పరాయి రాష్ట్ర పాలన మనకొద్దు..మన రాష్ట్రాన్ని మనమే పాలించుకుందామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news