మీనా కుటుంబాన్ని పరామర్శించిన రజినీకాంత్

తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో, పలు చిత్రాల్లో నటించిన ప్రముఖ హీరోయిన్ మీనా భర్త విద్యాసాగర్ మంగళవారం రాత్రి కన్నుమూశారు. చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు విద్యాసాగర్. గతంలో మీనా కుటుంబం మొత్తానికి కరోనా సోకింది. అప్పట్లో విద్యాసాగర్ కోలుకున్నప్పటికీ.. కొన్ని నెలలుగా పోస్టుకోవిడ్ సమస్యలతో బాధపడ్దారు. లంగ్స్ ఇన్ఫెక్షన్తో రీసెంట్ గా ఆసుపత్రిలో చేరారు. ఆరోగ్యం విషమించి ఊపిరితిత్తుల మార్పిడి చేయాల్సి వచ్చింది.

బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి నుంచి లంగ్స్ కోసం వెతికారు. అంతలోనే విద్యాసాగర్ ఆకస్మికంగా మృతి చెందారు. దీంతో సినీ పరిశ్రమ షాక్ కి గురైంది. ఈ క్రమంలో తమిళ సీనియర్ అగ్ర కథానాయకుడు రజనీకాంత్ మీనా ఇంటికి వెళ్లారు. విద్యాసాగర్ పార్థివదేహానికి నివాళులర్పించిన ఆయన మీనా, ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించారు.