‘ రాజు గారి గ‌ది 3 ‘ టైటిల్ సాంగ్ ర‌చ్చ రంబోలానే… (వీడియో)

-

బుల్లితెర‌పై పాపుల‌ర్ యాంక‌ర్ ఓంకార్ ద‌ర్శ‌కుడిగా మారి రాజు గారి గ‌ది సీక్వెల్స్‌తో మంచి పాపుల‌ర్ డైరెక్ట‌ర్‌గా మారిపోయాడు. ఈ సీరిస్‌లో ఇప్పుడు రాజు గారి గ‌ది 3 సినిమా తెర‌కెక్కించిన ఓంకార్ ఈ సినిమా హిట్‌పై ఫుల్ కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు. ఓంకార్ సోద‌రుడు అశ్విన్ బాబు, అవికా గోర్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు ఓంకార్ తెరకెక్కిస్తున్న చిత్రం రాజు గారి గది 3. మొదట ఈ సినిమాలో తమన్నా హీరోయిన్‌గా ఎంపికైనా.. కొన్ని కారణాల వల్ల ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది.

రాజు గారి గది ఫ్రాంచైజీలో వస్తున్న ఈ మూడో సినిమా ఈనెల 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. రాజు గారి గదిలో మెడికల్ మాఫియా, పార్ట్ 2లో శత్రుత్వం, ఇగో అనే అంశాలను చూపించాం. ఈ రెండు చిత్రాల మాదిరిగా రాజు గారి గది 3లో సోషల్ మెసేజ్ ఉండదు. పూర్తి కమర్షియల్ ఎంటర్టైనర్‌గా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే రీతిలో ఈ మూవీని తెరకెక్కించారు.

ఇక తాజాగా ఈ రోజు ఈ సినిమా టైటిల్ సాంగ్ రిలీజ్ చేశారు. రా రారా నా గ‌దిలోకి రారా అన్న ప‌ల్ల‌వితో వ‌చ్చే ఈ సాంగ్ మాస్‌కు మాంచి ఊపు ఇచ్చేలా ఉంది. ర‌సిక శిఖామ‌ణులారా… క‌శి క‌ళావ‌రులారా నేను చెప్పేది వింటారా… వాట‌ర్ ఉంది.. మీట‌ర్ ఉంది… మేట‌ర్ ఉంది… సుక్కుంది… ముక్కుంది… ప‌క్కుంది… ఇవ‌న్నీ ఉన్న మా గ‌దిలోకి వ‌స్తారా ? అంటూ ఈ ప‌దాలు వింటుంటేనే మాస్ ఎలా ఊగిపోతారో అర్థం చేసుకోవ‌చ్చు. సాంగ్ అంతా ర‌చ్చ రంబోలానే ఉంది. ఇక ఈ సాంగ్‌పై మీరు కూడా ఓ లుక్కేయండి.

Read more RELATED
Recommended to you

Latest news