బ‌న్నీని ముప్పు తిప్పులు పెడుతోన్న క్రేజీ హీరోయిన్‌

-

పూజా హెగ్డే ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో స్టార్ హీరోల‌కు బెస్ట్ ఆప్ష‌న్‌గా మారిన క్రేజీ హీరోయిన్‌. అక్కినేని హీరో నాగ చైతన్య నటించిన ‘ఒకలైలా కోసం’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన పూజా హెగ్డే ఆతరువాత ఇక్క‌డ వ‌రుస ఆఫ‌ర్ల‌తో బిజీ హీరోయిన్‌గా మారిపోయింది. వ‌రుణ్ తేజ్ డెబ్యూ మూవీ ముకుంద‌, బాలీవుడ్‌లో హృతిక్‌రోషన్ స‌ర‌స‌న మొహంజోదారోలో న‌టించే ఛాన్స్ కొట్టేసింది. ఆ త‌ర్వాత ఆమె తెలుగులో స్టార్ హీరోల‌తో ఆన్‌స్క్రీన్ రొమాన్స్ చేస్తూ ఇక్క‌డ ఫుల్ బిజీ అయ్యింది.

అల్లు అర్జున్‌తో దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్‌, ఎన్టీఆర్‌తో అర‌వింద స‌మేత‌, మ‌హేష్‌బాబు మ‌హ‌ర్షి సినిమాల్లో న‌టించిన పూజ రీసెంట్‌గా వ‌రుణ్‌తో గ‌ద్ద‌ల‌కొండ సినిమాతో రెండోసారి జోడీ క‌ట్టింది. ఇక ప్ర‌స్తుతం ఆమె స్టైలీష్‌స్టార్ అల్లు అర్జున్ హీరోగా త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న అల వైకుంఠ‌పురంలో హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ సినిమాలో ఆమెకు బర్త్ డే విషెస్ చెపుతూ ఓ పోస్ట‌ర్ రిలీజ్ చేశారు.

ఈ పోస్ట‌ర్‌లో పూజ‌ రెడ్ బాక్సింగ్ గ్లోవ్స్ ధరించుకొని ఎవరినో రఫ్ ఆడేస్తోంది. ఇక ఈ సినిమాలో పూజ సాఫ్ట్‌వేర్ కంపెనీ బాస్‌గా క‌నిపించ‌నుంది. ఆమె ద‌గ్గ‌ర ప‌నిచేసే బ‌న్నీని ఆమె ఓ లేడీ బాస్‌గా ఫుట్‌బాల్ ఆడుకుంటుంద‌ట‌. ఈ రోల్‌లో ఇద్ద‌రి మ‌ధ్య వ‌చ్చే సీన్లు అల‌రిస్తాయ‌ట‌. పూజా ప్రేమకోసం తపించే మధ్యతరగతి యువ ఉద్యోగి అయిన బన్నీ, అసలు పట్టించుకోని కంపెనీ యజమానిగా పూజా మరియు వీరిద్దరి మధ్య సాగే ఆఫీస్ ఎపిసోడ్స్ ఆసక్తికరంగా సాగుతాయట.

Read more RELATED
Recommended to you

Latest news