డబ్బు కోసం అయితే సినిమాలలోకి రావద్దంటూ సలహా ఇస్తున్న రకుల్..!!

-

రకుల్ ప్రీతిసింగ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఒకరకంగా చెప్పాలంటే ఇప్పుడు ఈమె గ్లామర్ బొమ్మ కాదు.. డ్యూయట్ లాక్ పరిమితమైన నటి కాదు.. వైవిధ్యమైన పాత్రలు ఎంచుకుంటూ ప్రయోగాలకు సిద్ధమవుతోంది. తాజాగా ఈమె నటించి విడుదలైన ఛత్రీవాలీ.. ఇందుకు చక్కటి ఉదాహరణ అని చెప్పవచ్చు.. కండోమ్ టెస్టర్ పాత్రలో నటించి తాను ఏమిటో నిరూపించుకున్న ఈ ముద్దుగుమ్మ వాస్తవానికి చాలా లోతుగా ఆలోచించే మనిషి.. ఆమె మాటలను బట్టి ఆ గాఢత మనం అర్థం చేసుకోవచ్చు.

కరోనా ఒక మంచి పని చేసింది.. లాక్ డౌన్ సమయంలో బాలీవుడ్కు ప్రాంతీయ సినిమాలకు మధ్య ఉన్న విభజన రేఖ చెరిగిపోయేలా చేసింది. దీంతో దక్షిణాది చిత్రాల గురించి దేశానికి అంతా తెలిసింది.. వీక్షకులకు ఎంతో కంటెంట్ అందుబాటులోకి వచ్చింది. ఇకపోతే సినిమాలలో మగవాళ్ళదే ఆధిపత్యం.. మనం నివసిస్తున్నది పురుషాధిక్య సమాజంలోనే.. అంతమాత్రాన భయపడుతూ కూర్చోలేం కదా ..ఓటమిని అంగీకరించి వెనక్కి వెళ్ళిపోలేము కదా.. నేను పురుషుడినా.. స్త్రీ నా అన్నది అప్రస్తుతం.. నేను స్టార్ ని.. నటన నా ప్రాణం.. ఆ దృక్పథంతోనే నేను పరిశ్రమను చూస్తాను.. ఒకవేళ మీలో ఎవరైనా డబ్బు కోసమో గ్లామర్ కోసమో సినిమాల్లోకి రావాలి అనుకుంటే దయచేసి రాకండి..

అలా వస్తే రెండు మూడు గంటలు కూడా నిద్రపోలేము. కడుపునిండా తినలేము ..హాయిగా వీధిలో తిరగలేము.. ఇష్టమైన రెస్టారెంట్లకు వెళ్లలేము.. ఒక బలమైన సంకల్పం ఉంటే తప్ప పరిశ్రమలోకి రాకండి అంటూ కొత్త వాళ్లకు సలహా ఇస్తోంది ఈ ముద్దుగుమ్మ. మొత్తానికైతే రకుల్ ప్రీతిసింగ్ చేసిన ఈ కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news