ఎన్టీఆర్ బయోపిక్ లో శ్రీదేవిగా రకుల్

-

ఎన్టీఆర్ బయోపిక్ లో కాస్టింగ్ విషయంలో చిత్రయూనిట్ కు పెద్ద టాస్క్ అని చెప్పొచ్చు. కైకాల, విద్యా బాలన్, రానా, సుమంత్ ఈ సినిమాలో భాగమవుతున్నారని అఫిషియల్ గా బయటకు వచ్చింది. క్రిష్ డైరక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రీదేవి పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్ ఫైనల్ అయ్యిందట. ఆ సినిమా నిర్మాతల్లో ఒకరు బాలీవుడ్ మీడియాతో ఈ విషయాన్ని పంచుకున్నారు.

హీరోయిన్ తొలినాళ్లలో ఎన్.టి.ఆర్ తో కలిసి నటించింది శ్రీదేవి. ఈ పాత్రలో రకుల్ ఎలా ఉండబోతుందో చూడాలి. బయోపిక్ సినిమాలకు ఈమధ్య బాగా క్రేజ్ ఏర్పడింది. మహానటి విజయం అందుకు ఒక కారణమని చెప్పొచ్చు. అయితే ఎన్టీఆర్ బయోపిక్ సిని, రాజకీయ విషయాల ప్రస్థావన ఉంటుంది. దర్శకుడు క్రిష్ వాటన్నిటిని కరెక్ట్ గా హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది.

సినిమా స్టార్ కాస్ట్ కూడా భారీగా ఉంటుందని లిస్ట్ చూస్తే తెలుస్తుంది. 2019 సంక్రాంతి బరిలో దిగుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. విశ్వవిఖ్యాత నట సార్వభౌముని జీవిత చరిత్ర ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version