సినిమాల సంగతి పక్కన పెడితే హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ గా ఉంటుంది.వరుసగా సినిమాలు చేసినా చేయకపోయినా సరే ఆమె సోషల్ మీడియాలో ఎప్పుడూ సరదాగా కామెంట్స్ పెడుతూ ఉంటుంది. ఇక తనను ఎవరైనా అసభ్యంగా మాట్లాడినా సరే సీరియస్ అవుతూ అదే స్థాయిలో సమాధానం చెప్తూ ఉంటుంది. తన వ్యక్తిగత విషయాలను ఎక్కువగా ప్రస్తావిస్తూ ఉంటుంది.
సినిమాలు లేక ఖాళీ గా ఉన్న రకుల్ కొత్తగా యూట్యూబ్ ఛానల్ తో ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఈ ఛానల్ లో ఆమె వంట కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ విషయాన్ని మంగళవారం ప్రపంచ ఆరోగ్య దినోత్సవ సందర్భంగా తన సోషల్ మీడియా ఖాతాలో వెల్లడించారు. ఇక ఈ సందర్భంగా ఆమె కీలక ప్రకటన చేసింది. తన యూట్యూబ్ ఛానల్ ద్వారా వచ్చే ఆదాయాన్ని కరోనాపై పోరాటానికి పీఎం కేర్ ఫండ్స్‌కు అందించనున్నట్లు ఆమె పేర్కొన్నారు.
మరో హీరోయిన్ హన్సిక కూడా యుట్యూబ్ ఛానల్ కు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా రకుల్ కొన్ని వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం తనకు చాలా సమయం ఉంది కాబట్టి యూట్యూబ్ ఛానెల్‌ను ప్రారంభించాలని అనుకున్నాను, దీనిలో అన్ని సరదా విషయాలను మీతో పంచుకుంటానని పేర్కొంది. ప్రతి ఒక్కరం ఆనందాన్ని పంచుదాం. మార్పు కోసం ఇప్పుడే ఛానల్‌ను సబ్‌స్ర్కైబ్ చేయండమో ఆమె విజ్ఞప్తి చేసారు. చాకొలెట్ పాన్‌కేక్‌ను తయారి వీడియో ను ఆమె పోస్ట్ చేసారు.
anddddd because it’s world health day we kickstart with cooking some joy .. healthy joy https://t.co/J2vF3mAIiz subscribe now ! pic.twitter.com/dyrGYgyufx
— Rakul Singh (@Rakulpreet) April 7, 2020